మలేరియాపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

మలేరియాపై అప్రమత్తంగా ఉండాలి

Apr 23 2026 7:18 AM | Updated on Apr 23 2026 7:18 AM

మలేరియాపై అప్రమత్తంగా ఉండాలి

జిల్లా మలేరియా అధికారి డి.సూర్యనారాయణ

కొమరాడ: ఏజెన్సీ గ్రామల్లో ప్రజలు మలేరియాపై అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా మలేరియా అధికారి డి.సూర్యనారాయణ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన కొమరాడ మండలంలోని చినఖేర్జిల పంచాయతీ బంజుకుప్ప గ్రామంలో ‘మా ఊరికి మలేరియా’ అనే కార్యక్రమానికి హాజర య్యారు. ఆనంతరం అక్కడ ఉన్న మలేరియా జర్వపీడితులతో మాట్లాడి చిక్సిత అందించి వారి కుటుంబ సభ్యులకు రక్తపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామల్లో మురుగునీరు నిల్వలేకుండా చేసుకోవాలని సూచించారు. ఖాళీ కొబ్బరిబొండాలు ఎక్కడపడితే అక్కడ ఉండకూడదన్నారు. గ్రామంలో పారిశుధ్య పనులు నిర్వహించాలని కాచి చల్ల ర్చిన నీటి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్‌, ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement