ఫిడే ఆర్బిటర్‌ టైటిల్‌ సాధించిన ప్రసాద్‌ | - | Sakshi
Sakshi News home page

ఫిడే ఆర్బిటర్‌ టైటిల్‌ సాధించిన ప్రసాద్‌

Apr 23 2026 7:18 AM | Updated on Apr 23 2026 7:18 AM

ఫిడే ఆర్బిటర్‌ టైటిల్‌ సాధించిన ప్రసాద్‌

చీపురుపల్లి: ప్రపంచంలో ప్రతిష్టత్మకంగా బావించే ఫిడే ఆర్బిటర్‌ టైటిల్‌ను చీపురుపల్లి పట్టణంలోని శ్రీనివాస జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఏడీఎన్‌ఎస్వీ. ప్రసాద్‌ సాధించారు. ఇంతవరకు సీనియర్‌ నేషనల్‌ ఆర్బిటర్‌గా ఉన్న ప్రసాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో చదరంగం టోర్నమెంట్లు నిర్వహించే ఫిడే సంస్థ ఫిడే ఆర్బిటర్‌గా గుర్తించిన మేరకు ఫిడే అధ్యక్షుడు ధురవీకరణ పత్రం పంపించారు. ఇటీవల గుంటూరులో జరిగిన ఫిడే కౌన్సిల్‌ సెమినార్‌ లో దేశవ్యాప్తంగా 35 మంది పోటీ పడగా అందులో 12 మందిని ఫిడే ఆర్బిటర్లుగా ఎంపిక చేశారు. అందులో ప్రసాద్‌ ఉన్నారు. ప్రసాద్‌ ప్రస్తుతం విజయనగరం జిల్లా చదరంగం అసోసియేషన్‌ కార్యదర్శిగా, రాష్ట్ర ఆర్బిటర్‌ కమిటీ కన్వీనర్‌గా, ఫెయిర్‌ ప్లే కమిటీ మెంబర్‌గా, మన్యం జిల్లా కన్వీనర్‌గా వ్యవహరిస్తునారు. ఈ టైటిల్‌ను ఆయన సాధించినందుకు పలువురు చదరంగం క్రీడాకారులు రాష్ట్రవ్యాప్తంగా చదరంగం అసోసియేషన్‌ అధికారులు అభినందనలు తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement