ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు సర్కారు | - | Sakshi
Sakshi News home page

ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు సర్కారు

Apr 22 2026 8:00 AM | Updated on Apr 22 2026 8:00 AM

ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌

రేగిడి: చంద్రబాబు ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించి, రెండేళ్లుగా రెడ్‌బుక్‌ పాలన సాగిస్తోందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ విమర్శించారు. రేగిడిలో స్థానిక విలేకరులతో ఆయన మంగళవారం మాట్లాడారు. అధికార దాహంకోసం సూపర్‌సిక్స్‌ హామీలిచ్చి అమలులో చేతులెత్తేయడం విచారకరమన్నారు. గ్రామ పంచాయతీల్లో వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య పనులు చేయలేని దుస్థితి నెలకొందన్నారు. ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువ కావడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలపై కేసులు బనాయిస్తున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల కన్వీనర్‌ వావిలపల్లి జగన్మోహనరావు, వైఎస్సార్‌ సీపీ రాజాం నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షుడు కరణం శ్రీనివాసరావు, ఎంపీటీసీ కింజరాపు సురేష్‌, పాడి లక్ష్మునాయుడు, కెంబూరు వెంకటేశ్వరరావు, గార రమణ, టంకాల బుచ్చెన్నాయుడు, రామారావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement