కాలు కోల్పోయినా కనికరం లేదు.. | - | Sakshi
Sakshi News home page

కాలు కోల్పోయినా కనికరం లేదు..

Apr 21 2026 6:13 AM | Updated on Apr 21 2026 6:13 AM

నా పేరు ఆర్నిపల్లి శివ. మాది బాడంగి మండలం పాల్తేరు గ్రామం. మూడేళ్ల కిందట జరిగిన ప్రమాదంలో ఎడమ కాలికి దెబ్బ తగలడంతో మోకాలి పైవరకు కాలును తొలగించారు. అప్పటి నుంచి ప్లాస్టిక్‌ కాలుతో, కర్ర సహాయంతో నడుస్తూ బతుకు పోరాటం సాగిస్తున్నాను. వైద్యులు 72 శాతం వైకల్యం ఉన్నట్టు సదరం ధ్రువపత్రం ఇచ్చారు. దానిని పట్టుకుని రెండేళ్లుగా పింఛన్‌ కోసం తిరుగుతున్నా మంజూరు కావడం లేదు. వైద్య ఖర్చులకు కూడా అప్పు చేస్తున్నాను. పింఛన్‌ సైట్‌ ఓపెన్‌ చేయకపోవడం విచాకరం. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మా లాంటి వారికి బతుకు కష్టాలు తప్పడంలేదు.

Advertisement
 
Advertisement
Advertisement