మా గోడు వినండి బాబూ.. | - | Sakshi
Sakshi News home page

మా గోడు వినండి బాబూ..

Apr 21 2026 6:13 AM | Updated on Apr 21 2026 6:13 AM

నివాసం ఉన్న చోటే పట్టాలివ్వాలి

దశాబ్దాలు నివసిస్తున్నాం.. ప్రభుత్వం ఇచ్చిన జీఓ 30 ప్రకారం వంద గజాల ఇంటి స్థలానికి పట్టాలివ్వడంలో జాప్యంపై విజయనగరం నగర పరిధిలోని ఎల్బీజీ నగర్‌, గురజాడ నగర్‌, రామకృష్ణ నగర్‌, వినాయక నగర్‌, గొడగల వీధి కాలనీవాసులు ఆందోళన వ్యక్తంచేశారు. అధికారులను నిలదీశారు. తాగడానికి గుక్కెడు నీరు, నడవడానికి రోడ్డు లేక నరకయాతన అనుభవిస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారంటూ వాపోయారు. కార్యాక్రమంలో సీపీఎం నగర కమిటీ సభ్యులు బి.రమణ, నగర కమిటీ సభ్యులు రంభ శ్రీనివాసరావు, ఆనంద్‌, రాజు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement