సాగు భూమి పోతే
చావే శరణ్యం
నాలుగు తరాలుగా సుమారు 48.30 ఎకరాల ఎండోమెంట్ దేవస్థానం భూములను సాగు చేసుకుంటూ బతుకుతున్నాం. ,గ్రామంలోని కొందరు స్వార్థపరులు తమకు ఆ భూములు కావాలని, వేలం వేయించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. వేలం ప్రక్రియను నిలిపివేసి, తమకే సాగుకు భూములు ఇవ్వాలంటూ గజపతినగరం మండలం పాత, కొత్త శ్రీరంగరాజపురం గ్రామస్తులు కలెక్టర్‌కు విన్నవించారు. తొలుత కలెక్టరేట్ ఎదుట తమ ఆవేదన వ్యక్తంచేశారు.
చిత్రంలో కాళ్లుచచ్చుబడిపోవడంతో ట్రైసైకిల్‌కే పరిమితమైనది.. పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామానికి చెందిన మీసాల యుగందర్. చెట్టుమీద నుంచి పడిపోవడంతో నడవలేని స్థితికి చేరాడు. పింఛన్ మంజూరు చేయాలంటూ రెండేళ్లగా డాక్టర్లు ఇచ్చిన సదరం ధ్రువపత్రం పట్టుకుని తిరుగుతున్నా ఫలితం శూన్యం. కొత్తపింఛన్లు మంజూరుకు వెబ్‌సైట్ ఓపెన్ కాలేదని అధికారులు చెబుతున్నారని, నా లాంటి వారు ఎలా బతకాలో పాలకులు, అధికారులే చెప్పాలంటూ గగ్గోలు పెట్టాడు.


