విజయనగరం ఫోర్ట్:
రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు ఉచిత తక్షణ వైద్యం సహాయం అందించేందుకు పీఎం రాహత్ పథకాన్ని ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు (ఆరోగ్యశ్రీ) ద్వారా అమలు చేస్తున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీఎంరాహత్ పథకం వాల్ పోస్టర్లను ఆయన సోమవారం ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాద బాఽధితులకు గోల్డెన్ అవర్లో రూ.1.5 లక్షల వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు పీఎంరాహత్ పథకాన్ని జిల్లాలో 23 ఆస్పత్రుల్లో అందిస్తామన్నారు. సమావేశంలో జేసే సేతుమాధవన్, డీఆర్వో సత్తిబాబు, ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డాక్టర్ కె.సాయిరాం, డీఎల్‌ఓ డాక్టర్ కె.రాణి, డీసీహెచ్‌ఎస్ ఎన్.పద్మశ్రీరాణి, తదితరులు పాల్గొన్నారు.


