కలకలం రేపిన లేగ దూడల కళేబరాలు | - | Sakshi
Sakshi News home page

కలకలం రేపిన లేగ దూడల కళేబరాలు

Apr 21 2026 6:13 AM | Updated on Apr 21 2026 6:13 AM

జామి: మండలంలోని అలమండ, కొవ్వాడ గ్రామాల మధ్యలో ఉన్న పల్లె గెడ్డలో సుమారు 15 లేడదూడల కళేబరాలు తీవ్ర కలకలం రేపాయి. సోమవారం స్థానికులు గెడ్డలో లేడదూడల కళేబరాలను చూసి ఆందోళనకు గురయ్యారు. ఈ కళేబరాలు ఈ గెడ్డలో ఏ విదంగా పడి ఉన్నాయి అని పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి ఇన్ని మృత్యువాత పడిఉండడం గమనార్హం. స్థానికులు లేగ దూడలను, పశువులను సంతలకు పెద్ద పెద్ద లారీలపై తరలిస్తుంటారని సోమవారం అలమండ సంత కావడంతో వాటిని కబేళాకు తరలించడానికి వాహనాల్లో కాళ్లకు తాళ్లు కట్టి చుట్టూ గోనె సంచులు కడుతుంటారని దీంతో గాలి లేక చిన్నవి కావడంతో మృత్యువాత పడి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.పశువులను కబేళాలకు ఏవిధంగా తరలిస్తున్నారో అనడానికి ఇదే నిదర్శనం. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ పశురవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

అధికారులు బృందం సందర్శన

విషయం తెలుసుకున్న ఎస్సై వీర జనార్దన్‌, పశు వైద్యాధికారి నరేష్‌కుమార్‌, పంచాయతీ కార్యదర్శి ఎర్నమ్మ ఘటనా స్ధలానికి వెల్లి పరిశీలించి కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement