సీసీలా..సర్వేయర్‌లా..! | - | Sakshi
Sakshi News home page

సీసీలా..సర్వేయర్‌లా..!

Apr 20 2026 9:23 AM | Updated on Apr 20 2026 9:23 AM

సీసీలా..సర్వేయర్‌లా..!

● డిప్యుటేషన్‌పై సర్వేయర్లుగా డీఆర్‌డీఏ సీసీలు

కొద్ది నెలల క్రితం మళ్లీ సీసీలుగా డీఆర్‌డీఏకు

● వారిలో కొంతమంది రెవెన్యూ శాఖలో సర్వేయర్లుగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు

విజయనగరం ఫోర్ట్‌: డీఆర్‌డీఏ (జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ) పరిధిలో పనిచేసే కమ్యూనిటీ కో ఆర్డినేటర్ల(సీసీ)లో కొంతమంది వ్యవహారం విమర్శలకు తావిస్తుంది. డీఆర్‌డీఏ శాఖలో పనిచేస్తున్న 12మంది సీసీలు సర్వేయర్లుగా రెవెన్యూ శాఖకు డిప్యుటేషన్‌పై వెళ్లారు. కొద్ది నెలల క్రితం తిరిగి డీఆర్‌డీఏకు వచ్చేశారు. దీంతో వారిని సీసీలుగా డీఆర్‌డీఏ అధికారులు వివిధ మండలాల్లో నియమించారు. అయితే రెవెన్యూశాఖ నుంచి డీఆర్‌డీఏకు వెనక్కి వచ్చినప్పటికీ కొంతమంది సీసీలు సర్వేయర్లుగా రెవెన్యూ శాఖలోనే కొనసాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ రెవెన్యూ అధికారులతో సత్ససంబంధాలు కొనసాగిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సర్వే చేయడానికి వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఓవ్యక్తి వారిపై డీఆర్‌డీఏ అధికారులకు, సీఎంఓకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా డీఆర్‌డీఏ అధికారులు దాచినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోపణలు వచ్చిన తరువాత ఓ సీసీని విజయనగరం నుంచి వేరే మండలానికి బదిలీ చేసినట్లు సమాచారం.

రెవెన్యూలో తప్పులతో మాకేం సంబంధం

రెవెన్యూ శాఖలో సర్వేయర్లుగా చేసినప్పుడు వారు చేసిన తప్పుల గురించి మాకేం సంబంధం. రెవెన్యూ శాఖ నుంచి తిరిగి వచ్చేసిన తర్వాత వారిని సీసీలుగా నియమించాం. కొంతమంది సీసీలు సర్వేయర్లుగా చలామణీ అవుతున్న విషయం తెలియదు. ఓ సీసీని వేరే కారణంతో బదిలీ చేశాం.

శ్రీనివాసపాణి, డీఆర్‌డీఏ పీడీ

Advertisement
 
Advertisement
Advertisement