సాక్షి విలేకరి మృతి | - | Sakshi
Sakshi News home page

సాక్షి విలేకరి మృతి

Apr 20 2026 9:23 AM | Updated on Apr 20 2026 9:23 AM

సాక్షి విలేకరి మృతి

దత్తిరాజేరు: ప్రముఖ పత్రికలలో పనిచేసిన అనుభవం ఉన్న సీనియర్‌ పాత్రికేయుడు, ప్రస్తుతం సాక్షి దినపత్రికలో కలెక్టరేట్‌ డేట్‌లైన్‌తో వార్తలు రాస్తున్న విలేకరి సుంకరి రాజేశ్వరరావు(శివ)(49)ఆదివారం ఉదయం ఆనారోగ్యంతో విజయనగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో మృతిచెందారు. కొద్ది నెలల క్రితం ఆనారోగ్యానికి గురైన ఆయన చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతుడికి వెలుగులో పనిచేస్తున్న భార్య ఇందిర, కుమారుడు ఉన్నారు. మృతి వార్త తెలుసుకున్న వెంటనే ఆర్‌కే టౌన్‌షిప్‌లో ఉన్న ఆయన ఇంటి వద్దకు జర్నలిస్టు సంక్షేమ సంఘం అధ్యక్షుడు లింగాలనర్సింగరావు, జిల్లా వ్యాప్తంగా పాత్రికేయులు పెద్ద ఎత్తున చేరుకుని మృతదేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు,

Advertisement
 
Advertisement
Advertisement