జిల్లా ఉపాఽధి శిక్షణ అధికారిగా మెస్సీ ఇవాంజిలిన్‌ | - | Sakshi
Sakshi News home page

జిల్లా ఉపాఽధి శిక్షణ అధికారిగా మెస్సీ ఇవాంజిలిన్‌

Apr 19 2026 7:23 AM | Updated on Apr 19 2026 7:23 AM

విజయనగరం అర్బన్‌: జిల్లా ఉపాధి శిక్షణ అధికారిగా ఆర్‌.మెస్సి ఇవాంజిలిన్‌ శనివారం పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఇదే సమయంలో విశాఖపట్నం జిల్లా ఉపాధి అధికారిగా రెగ్యులర్‌ బాధ్యతలను కూడా చేపట్టారు. ఏపీపీఎస్‌ గ్రూప్‌–1 సర్వీస్‌లో ఎంపికై న ఇవాంజిలిన్‌ ఇప్పటి వరకు జిల్లా ఉపాధి శిక్షణ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వహీదా నుంచి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాఽధి అవకాశాల విస్తరణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.

ముగిసిన పారా లీగల్‌ వలంటీర్ల శిక్షణ

విజయనగరం లీగల్‌: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్‌ ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా పారాలీగల్‌ వలంటీర్లకు నిర్వహించిన శిక్షణ శనివారంతో ముగిసింది. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు, ప్రజలకు మధ్య వారధిగా ఉండేవారే పారా లీగల్‌ వలంటీర్స్‌ అని పేర్కొన్నారు. చిన్నచిన్న సమస్యలను వలంటీర్లు పరిష్కరిస్తారన్నారు. ఐదు రోజుల్లో 54 మంది పారా లీగల్‌ వలంటీర్లకు శిక్షణ ఇచ్చామన్నారు. శిక్షణ పొందిన వారిలో అంగన్‌వాడీ టీచర్లు, ట్రైబల్‌ యూనివర్సిటీ విద్యార్థులు, ఆశా వర్కర్స్‌ గ్రూప్‌ సభ్యులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ ఉన్నారు. వీరందరికీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా గుర్తింపు కార్డులు అందజేశారు.

గిరిజనుడి ఆత్మహత్య

సీతంపేట: మండలంలోని మెట్టు హడ్డుబంగి పంచాయతీ ఉప్పరజమ్మి గ్రామానికి చెందిన సవర మహేంద్ర (23) క్షణికావేశంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ వై.అమ్మన్నరావు చెప్పిన వివరాలు.. మృతుడు తండ్రి కడాయికి ముగ్గురు కుమారులు. వీరిలో రెండో కుమారుడు మహేంద్ర డిగ్రీ పూర్తి చేశాడు. అదే గ్రామానికి చెందిన దీవెనతో ఏడాది కిందట వివాహమైంది. ఇద్దరు కలిసి శ్రీకాకుళంలోని వేర్వేరుగా ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. మహేంద్ర ఐస్‌క్రీం పార్లర్‌లో పని చేస్తున్నాడు. భార్య ప్రైవేటు ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తుంది. వీరిరువురి మధ్య ఇటీవల మనస్పర్దలు రావడంతో శ్రీకాకుళం నుంచి శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చి తోటలోని మామిడి చెట్టుకు ఉరి వేసుకున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. గ్రామస్తులు చూసి సమాచారం అందించారన్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.

చింతలపాలెంలో తీవ్ర ఉద్రిక్తత

నలుగురిపై కేసు నమోదు

కొత్తవలస : మండలంలోని చింతలపాలెం గ్రామం వద్ద అరుకు – విశాఖ రోడ్డుకు ఆను కొని ఉన్న స్థలంలో గల షాపులు, సమాధులను కొంతమంది వ్యక్తులు శుక్రవారం సాయంత్రం చిందరవందర చేశారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందోని గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై సీఐ షణ్ముఖరావు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. చింతలపాలెం గ్రామానికి చెందిన బోను లక్ష్మికి సంబంధించిన స్థలంలో షాపు లను సమాధులను మంగళపాలెం గ్రామానికి చెందిన పి.బాలరాజుతో పాటూ మరో ముగ్గురు వ్యక్తులు జేసీబీ సాయంతో చిందరవందర చేసి లక్ష్మిని కులం పేరుతో దూషించారని లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామన్నారు. ఈ మేరకు విజయనగరం ఇన్‌చార్జ్‌ డీఎప్పీ రాఘవులు క్షేత్ర స్థాయిలో శనివారం విచారణ నిర్వహించారు. బాధితురాలు నుంచి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నారు. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డీఎస్పీ రాఘవులు సీఐ షణ్ముఖరావుకు ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ, పలువురు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement