కార్మికులకు ఉపాధి భరోసా.. | - | Sakshi
Sakshi News home page

కార్మికులకు ఉపాధి భరోసా..

Apr 19 2026 7:23 AM | Updated on Apr 19 2026 7:23 AM

రామభద్రపురం కూరగాయల మార్కెట్‌ మా లాంటి పలువురు కార్మికులకు ఉపాధినిస్తోంది. కూరగాయలు, పండ్ల మూటలను లారీలకు లోడ్‌చేయడం వల్ల రోజూ రూ.400 నుంచి రూ.500 వరకు కూలి వస్తుంది. ఆ డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నా. రైతులు కష్టపడి పంట పండిస్తేనే మా లాంటి వారికి ఉపాధి.

– సవరాల శ్రీనివాసరావు, కార్మికుడు, రామభద్రపురం

జీవనాధారం ఇదే..

మా తాతదండ్రులనుంచి కూరగాయల సాగే మాకు జీవనాధారం. సీజన్‌లో అయితే రెండు మూడు రకాల కూరగాయలు పండిస్తాం. అన్‌సీజన్‌లో ఒకటి రెండు రకాలే పండిస్తాం. నిత్యం ఏదో ఒక రకం కూరగాయ పంటలు పండిస్తాం. ఈ ఏడాది ఎకరా విస్తీర్ణంలో వంగ, మిరప, చిక్కుడు తదితర కూరగాయలు వేశాను. దిగుబడి బాగా వచ్చింది. రామభద్రపురం మార్కెట్‌కు తెచ్చి విక్రయిస్తున్నాం.

– తూముల సింహాచలం, రైతు,

రామభద్రపురం

మూటలు కట్టుకుని జీవనం..

ఈ ప్రాంత రైతులు అధికంగా కూరగాయల పంటలు సాగుచేయడం వల్లే రామభద్రపురం మార్కెట్‌కు మంచి పేరువచ్చింది. రైతు, మార్కెట్‌ లేకుంటే మా లాంటి వారి జీవనం దుర్భరంగా ఉండేది. పదేళ్లుగా ఇక్కడే కలాసీగా పనిచేస్తున్నాను. కాలువిరిగిపోవడంతో మూటలు కట్టుకుని బతుకుతున్నాను.

– బోను అప్పలనాయుడు, రామభద్రపురం

Advertisement
 
Advertisement
Advertisement