ఎం.గుమడాంలో...గంపెడు సమస్యలు | - | Sakshi
Sakshi News home page

ఎం.గుమడాంలో...గంపెడు సమస్యలు

Apr 18 2026 8:23 AM | Updated on Apr 18 2026 8:23 AM

తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం

తాగునీటిని దూరంగా ఉన్న బోరు నుంచి తెచ్చుకోవాల్సి వస్తోంది. జల్‌జీవన్‌ మిషన్‌ పనులు పూర్తిచేయలేదు. తాగునీటి పథక నిర్మాణాన్ని అసంపూర్తిగా విడిచిపెట్టేశారు. అధికారులు, పాలకులు స్పందించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.

– ఆవాల సూర్యం, ఎం.గుమడాం బీసీ కాలనీ

అసంపూర్తి పనులు

బీసీ కాలనీలో పూర్తిస్థాయిలో డ్రైనేజీ నిర్మించలేదు. మురుగునీరు కాలనీలోనే నిల్వ ఉంటోంది. ఇబ్బందులు పడుతున్నాం. కాలువ పనులు పూర్తిచేసి సమస్యను పరిష్కరించాలి.

– ఎం.నరసయ్య, ఎం.గుమడాం బీసీ కాలనీ

సమస్యలు పరిష్కరిస్తాం

గజపతినగరం మండలం ఎం.గుమడాం బీసీ కాలనీలో రక్షిత మంచినీటి పథకం నిర్మాణంలో ఉంది. పనులు పూర్తిచేసి తాగునీటి సమస్యకు పరిష్కారం చూపుతాం. – ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ

ఎం.శ్రీనివాసరావు(గజపతినగరం)

గజపతినగరం: గజపతినగరం మండలం ఎం.గుమడాం గ్రామస్తులు సమస్యల చట్రంలో నలిగిపోతున్నారు. బిందెడు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. బీసీకాలనీ వాసులు సుదూరంలో ఉన్న బోరునీటిని తెచ్చుకుని దాహం తీర్చుకుంటున్నారు. బిందెడు నీటికోసం బోరువద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. గత ప్రభుత్వం గ్రామంలో చేపట్టిన జల్‌జీవన్‌ మిషన్‌ పనులను ప్రస్తుత ప్రభుత్వం చేపట్టకపోవడంతో తాగునీటి కష్టాలు తప్పడం లేదు. తాగునీటి పథక నిర్మాణం అసంపూర్తిగా ఉన్నా పట్టించుకునేవారే కరువయ్యారు. మరోవైపు మురుగునీటి సమస్య గ్రామస్తులను వెంటాడుతోంది. కాలువల నిర్మాణాలు అసంపూర్తిగా విడిచి పెట్టడంతో గ్రామస్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎక్కడికక్కడ మురుగు నీరు నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతోందని, దోమలు, ఈగలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

బిందెడు నీటికోసం మహిళలకు

అష్టకష్టాలు

మురుగుకాలువల నిర్మాణంలో

అలసత్వం

పూర్తికాని జల్‌జీవన్‌ మిషన్‌ పనులు

నిలిచిన తాగునీటి పథకం పనులు

ఆవేదనలో ఎం.గుమడాం వాసులు

Advertisement
 
Advertisement
Advertisement