● కోనేరు.. కన్నీరు.. | - | Sakshi
Sakshi News home page

● కోనేరు.. కన్నీరు..

Apr 18 2026 8:11 AM | Updated on Apr 18 2026 8:11 AM

ఈ చిత్రంలో పిచ్చిమొక్కల నడుమ అధ్వానంగా మారిన కోనేటిని చూశారా... అది నేనే.. బొబ్బిమండలం కోమటిపల్లిలోని మంచినీటి కోనేరును. దశాబ్దాల తరబడి కోమటిపల్లి ప్రజల స్నానాలు, తాగునీటికి వినియోగపడేదానిని. వేసవిలో సైతం నీరు నిండుగా ఉండేది. ఇక్కడి గట్టుపైన రామాలయం, ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం, షిర్డి సాయిబాబా ఆలయాలు సైతం ఉన్నాయి. దర్శనానికి వచ్చే భక్తులు ఇక్కడే పుణ్యస్నానాలు ఆచరించేవారు. కార్తీకమాసంలో స్వాముల సన్నిధిలతో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లేవి. పవిత్రంగా, శుద్ధిగా ఉండే కోనేటిని ఇటీవల కాలంలో నిర్లక్ష్యం చేశారు. అందుకే.. ఇదిగో ఇలా పిచ్చిమొక్కలు, రెల్లిపొదలతో అధ్వానంగా మారాను. గట్టువద్దనే కొందరు మందుబాబులు మద్యం సేవించి ఆ సీసాలు సైతం కోనేటిలోనే పడేస్తున్నారు. పవిత్రతను మంటగలుపుతున్నారు. ఇప్పటికై నా గ్రామపెద్దలు, యువత, ప్రత్యేకాధికారులు స్పందించి పూర్వవైభవం తీసుకురావాలని ఎదురుచూస్తున్నాను. ఏం చేస్తారో చూడాలి మరి. – బొబ్బిలి రూరల్‌

Advertisement
 
Advertisement
Advertisement