సంతకవిటి మండలంలోని మందరాడ–గోవిందపురం రోడ్డు అధ్వానంగా తయారైంది. అడుగుకోగుంత ఏర్పడడంతో ప్రయాణ, రవాణా కష్టాలు తప్పడం లేదు. మందరాడ నుంచి మోదుగుల పేట గ్రామానికి మొక్కజొన్న బస్తాలతో వెళ్తున్న ట్రాక్టర్ రోడ్డు గోతిలో దిగడంతో నిలిచిపోయింది. ఆ మార్గంలో వెళ్లేవారు, కళాసీలు కలిసి ముందుకు నెట్టడంతో ట్రాక్టర్ కదిలింది. పాలకులు, అధికారులు స్పందించి తక్షణమే రోడ్డును బాగుచేయాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు. ఓటేసి గెలిపించాక ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడం టీడీపీ పాలకులకు అలవాటుగా మారిందన్నారు. – సంతకవిటి


