మొక్కజొన్న పంట చేతికొచ్చింది. కండెలు వేరుచేయడం, ఆరబెట్టడం, నూర్పిడిచేసే పనుల్లో జిల్లా రైతులు బిజీ అయ్యారు. పంట చేతికొచ్చినా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంపై నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన క్వింటాకు రూ.2,400 మద్దతు ధర అందడం లేదని, దళారులకు క్వింటా రూ.1700కే విక్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుతో మొక్కజొన్న రైతుకు ఈ ఏడాది పెట్టుబడి కూడా రాలేదని, శ్రమటోడ్చి పండించిన పంటను కారుచౌకగా విక్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం


