ఖిలా వరంగల్: తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని చింతల్ ప్లైఓవర్ బ్రిడ్జి వద్ద ప్రమాదవశాత్తు శుక్రవారం తెల్లవారుజామున రైలునుంచి జాడిపడిన ప్రయాణికుడికి తీవ్రగాయాలయ్యాయి. జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ సుదర్శన్, కానిస్టేబుల్ రియాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా సత్తుపల్లి గ్రామానికి చెందిన ఎం.రాముడు(55) హైదరాబాద్‌లో కపూరి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ఎక్కి ఆంధ్రాకు వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. అతని పాదం నుజ్జునుజ్జు కాగా.. కుడి భుజానికి తీవ్రగాయాలయ్యాయి. ఆయనను 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.


