ప్రాణం తీసిన ఈత సరదా | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఈత సరదా

Apr 18 2026 8:11 AM | Updated on Apr 18 2026 8:11 AM

ప్రాణం తీసిన ఈత సరదా విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి

గుర్ల: ఈత సరదా 17 ఏళ్ల యువకుడి ప్రాణం తీసింది. ఈ విషాద సంఘటన గుర్ల మండల కేంద్రంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గుర్ల గ్రామానికి చెందిన కమ్మిండి సూర్య చంద్ర, స్నేహితులు కలిసి గుర్లలోని చంపావతి నది పరీవాహక ప్రాంతంలో సహపంక్తి భోజనాలను గురువారం ఏర్పాటు చేసుకున్నారు. సాయంత్రం సమయంలో చంపావతిలో స్నానం చేయడానికి దిగారు. సూర్య చంద్రకు ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. ఈ విషయం గమనించిన మిగిలిన యువకులు సూర్యచంద్రను బయటకు తీసి నెల్లిమర్ల సీహెచ్‌సీకి వైద్య చికిత్స నిమిత్తం తరలించారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యాధికారులు ఆస్పత్రికి రాకముందే మృతి చెందినట్లు తెలిపారు. సూర్య చంద్ర మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్త చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయాలని ఎస్సైకి ఫిర్యాదు చేయగా ఆ మేరకు గుర్ల ఎస్సై పి.నారాయణ రావు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి తల్లి కమ్మిండి లక్ష్మి, సోదరుడు ఉన్నారు.

పూసపాటిరేగ: మండలంలోని గోవిందపురం పరిధిలో వ్యవసాయ పొలాల్లో విద్యుత్‌షాక్‌తో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. తొత్తడాం గ్రామానికి చెందిన రాయ లక్ష్మణరావు (46) విద్యుత్‌ కాంట్రాక్ట్‌ పనులు చేస్తుంటాడు. విధి నిర్వహణలో భాగంగా నూతన విద్యుత్‌లైన్‌లు వేస్తుండగా విద్యుత్‌ సరఫరా అవుతున్న లైన్‌లు తగలడంతో షాక్‌కొట్టి అక్కడకక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య అరుణకుమారి, కుమార్తె జయలక్ష్మి ఉన్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పూసపాటిరేగ ఎస్సై ఐ.దుర్గాప్రసాద్‌ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement