ఎన్నికల ముందు ఊరూరా తిరిగి విద్యార్థులు, నిరుద్యోగులకు అబద్ధపు హామీలిచ్చి ఓట్లు దండుకున్నారు. తీరా గెలిచాక ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. రూ.5,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో పెట్టి విద్యార్ధుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారు. ప్రభుత్వం విదిల్చిన రూ.1,200 కోట్లు ఏ మూలకు సరిపోతాయి అని కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తూ సర్టిఫికెట్లు ఆపేస్తుంటే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవాలా..నిరుద్యోగ భృతి ఊసే లేదు. తక్షణమే పూర్తి నిధులు విడుదల చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తాం. – డి.రాము,
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి, విజయనగరం
నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేశారు!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3,000 భృతి ఇస్తాం అని వాగ్దానం చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కారు. చదువుకుని ఉద్యోగాల్లేక నానా అవస్థలు పడుతున్నాం. మాకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించకుండా మా కష్టాలను రెట్టింపు చేస్తోంది. ఇప్పటికై నా హామీని నిలబెట్టుకుని,నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలి. – సూరిబాబు, నిరుద్యోగి


