కార్మికులకు భరోసా | - | Sakshi
Sakshi News home page

కార్మికులకు భరోసా

Apr 17 2026 11:20 AM | Updated on Apr 17 2026 11:20 AM

విజయనగరం గంటస్తంభం:

కార్మిక సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కార్మికశాఖ ఉపకమిషనర్‌ ఎస్‌డీవీ ప్రసాదరావు కోరారు. ఈ ఏడాది మార్చి 1వ తేదీ తర్వాత కార్మికశాఖలో రిజిస్టర్‌ అయిన వారికి కూడా ఆర్థిక సాయం అందుతుందన్నారు. ఇప్పటికే జిల్లాలో సుమారు 90 వేల మంది కార్మికులు పేర్లు నమోదుచేసుకున్నారన్నారు. వీరి కుటుంబ సభ్యుల వివాహాలు, ప్రసూతి, ప్రమాదాలు, మరణాలకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.

ఫొటోలో కూలినది రేగిడి–సంతకవిటి మండలాలను అనుసంధానం చేసే సాయన్నచానల్‌ వంతెన. సంతకవిటి మండలం కొండగూడేం–రేగిడి మండలం ఖండ్యాం గ్రామాల మధ్య ప్రధాన రహదారిని కలిపే ఈ కల్వర్టు భారీ ఇసుకలారీలు రవాణా కారణంగా ఏడాది కిందట కూలిపోయింది. ఇంతవరకూ ఇక్కడ కొత్త వంతెన నిర్మించలేదు. 12 గ్రామాలకు చెందిన ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగుతోంది. కొండగూడెం, మాధవరాయపురం, వన్నలి, కృష్ణంవలస, జావాం, ఖండ్యాం ప్రాంతాలకు చెందిన రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తుల తరలింపునకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి పాలకులకు ఇసుక రవాణాపై ఉన్న శ్రద్ధ వంతెన నిర్మాణంలో లేదని ఈ ప్రాంతీయులు విమర్శిస్తున్నారు. పొరపాటున ప్రశ్నిస్తే ‘గాండ్రు’మంటున్నారని వాపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement