విజయనగరం లీగల్: జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న కాన్ఫరెన్స్ హాల్‌లో న్యాయవాదుల సంఘం గురువారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. బబిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయవాదులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని హితవు పలికారు. ఉచిత వైద్య శిబి రం ఏర్పాటుకు ముందుకు వచ్చిన స్థానిక వెంకటరామ ఆస్పత్రి యాజమాన్యం డాక్టర్ చిట్టి రమణారావు, వారి వైద్య బృందాన్ని ఈ సందర్భంగా ఆమె అభినందించి మెమెంటోలు అందజేశారు. న్యాయవాదులు, వారి గుమస్తాలు ఈ శిబిరంలో పాల్గొని అన్ని రకాల వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరంలో సంఘం అధ్యక్షుడు నళితం రమేష్ కుమార్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు బెల్లాన రవి, తదితరులు పాల్గొన్నారు.


