విజయనగరం క్రైమ్: విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి శ్రీనగర్ కాలనీ సమీపంలో గల బావిలో గుర్తు తెలియని మృతదేహాన్ని బుధవారం స్థానికులు కనుగొన్నారు. స్థానికుల నుంచి ఈ సమాచారం అందుకున్న వన్ టౌన్ సీఐ ఆర్వీఆర్‌కే చౌదరి స్టేషన్ సిబ్బందిని ఘటనా స్థలికి పంపించి వివరాలు సేకరించారు.సుమారు 40 నుంచి 50 ఏళ్లు వయస్సు కలిగి ఉండి, నాలుగు రోజుల క్రితం నూతిలో పడి ఉన్నట్లు గుర్తించామని సీఐ చౌదరి తెలిపారు. తెలుపు రంగుపై నలుపు గడులు కలిగిన షర్ట్, సిమెంట్ రంగు ఫ్యాంట్, నడుముకు లుంగీ, మాసిన తెలుపు రంగు గడ్డం ఉన్న మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే ఫోన్ నంబర్ 9121109419 కు తెలియజేయాలని సీఐ కోరారు.


