ఇంటిలో దించేయ్..
టీడీపీ కార్యకర్త ఇంటిలో 23 టన్నుల యూరియా డంప్
ఆర్‌ఎస్‌కే ఉన్నా.. ప్రైవేటు వ్యక్తి ఇంటికే..
అనుకూలమైన వాళ్లకి పంపిణీ కోసమేనని ఆరోపణలు
నిరసన తెలిపిన రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకులు
యూరియా వచ్చిందా...
నెల్లిమర్ల రూరల్:
బస్తా యూరియా లభించక రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. సకాలంలో పంటకు వేసుకునేందుకు యూరియా దొరకక ఆవేదన చెందుతున్నారు. దుకాణాలు, ఆర్‌ఎస్‌కేల వద్ద ఆందోళనలు చేస్తున్నారు. అయితే, విజయనగ రం జిల్లా నెల్లిమర్ల మండలంలోని వల్లూరు గ్రామంలో రైతులకు పంపిణీ చేసేందుకు సరఫ రా చేసిన 23 టన్నులు (540 బస్తాలు) యూరియాను ఏకంగా టీడీపీ కార్యకర్త ఇంటిలో శనివారం డంప్‌చేయడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వారికి నచ్చిన వారికి పంపిణీ చేసేందుకు రైతు సేవాకేంద్రంలో కాకుండా కార్యకర్త ఇం
టిలో డంప్ చేశారంటా గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు పంచాది శ్రీరాములునాయుడు, కంది శ్రీని వాసరావు, పంచాది శ్రీను తదితరులు ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయంలో కాకుండా టీడీపీ కార్యకర్త ఇంట్లో నిల్వ చేయడంపై వారంతా మండిపడ్డారు. పైవేటు వ్యక్తి ఇంటిలో ఎరువుల నిల్వను రైతులు అడ్డుకున్నా దౌర్జన్యం చేసి మరీ టీడీపీ నాయకులు తమ కార్యకర్త ఇంట్లో నిల్వ చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పంపిణీ చేయాల్సిన ఎరువులను అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే ఎరువుల బస్తాలను రైతు సేవా కేంద్రానికి తరలించి పంచాయతీ పరిధిలో ఉన్న రైతులందరికీ నిబంధనల ప్రకారం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయమై అగ్రికల్చర్ అసిస్టెంట్ దామోదర్ వద్ద ప్రస్తావించగా ఆర్‌ఎస్‌కేలో కిటికీలు సక్రమంగా లేకపోవడంతోనే ఓ ఇంట్లో డంప్ చేయాల్సి వచ్చిందన్నారు. గ్రామానికి చేరుకున్న ఎరువుల బస్తాలను సోమవారం నుంచి రైతులకు పంపిణీ చేస్తామని తెలిపారు.
ఇంటిలో దించేయ్..


