29న తోటపల్లిలో స్వామివారి కల్యాణం
గరుగుబిల్లి: ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా పేరుగాంచిన తోటపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో మాఘశుద్ధ ఏకాదశి సందర్భంగా ఈ నెల 29న సాయంత్రం 5 గంటల నుంచి వేంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవార్ల కల్యాణ మహోత్సవం, జొన్నాడ భట్టరు హరికష్ణమాచార్యులు, రేజేటి పార్థసారాచార్యులు, వీవీ అప్పలాచార్యులచే పాణిగ్రహణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు కల్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా నిర్వహిస్తున్నారు. కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 27న మంగళవారం సాయంత్రం నుంచి కల్యాణానికి సంబంధించి క్రతువులను నిర్వహించనున్నారు. ఫిబ్ర వరి 1న శనివారం పవిత్ర నాగావళి నదిలో స్వామివారికి శ్రీ చూర్ణోత్సవం శ్రీచక్ర తీర్థస్నానం నిర్వహించనున్నారు. కల్యాణంలో భక్తులు పాల్గొనాలని ఈఓ బి.శ్రీనివాస్ కోరారు.


