పార్వతీపురం చిన్నారికి అరుదైన ఖ్యాతి
పార్వతీపురం రూరల్ : పసి ప్రాయంలోనే గజ్జె కట్టి.. కూచిపూడి నృత్యంలో అద్భుత ముద్రలు చిలికి గిన్నిస్ వరల్డ్ రికార్డులో తనకంటూ ఒక పేజీని లిఖించుకుంది పార్వతీపురానికి చెందిన అక్షింతల హష్మితశ్రీ. భారత్ ఆర్ట్స్ అకాడమీ (హైదరాబాద్) ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి కూచిపూడి నృత్య ప్రదర్శనలో స్థానిక భాస్కర్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ 4వ తరగతి విద్యార్థిని హష్మితశ్రీ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అఫీషియల్ పార్టిసిపెంట్ గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ అరుదైన ఘనత సాధించిన హష్మితశ్రీని పాఠశాల కరెస్పాండెంట్ చుక్క భాస్కరరావు, ప్రిన్సిపాల్ ముప్పిడి ప్రసాదరావు ప్రత్యేకంగా అభినందించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు హష్మితశ్రీకి శుభాకాంక్షలు తెలిపారు.


