విజయనగరం
న్యూస్‌రీల్
అందుబాటులో వివిధ రకాల ఫ్లేవర్‌లు..
వీధివీధినా టీ పాయింట్
ఆధునిక రచ్చబండలుగా టీ స్టాల్స్
ఉదయం, సాయంత్రం వేళల్లో సందడి వాతావరణం
అన్ని రంగాల సమస్యలపై అక్కడే చర్చలు
వినియోగదారులను ఆకర్షిస్తున్న వివిధ రకాల ఫ్లేవర్లు
ఆదివారం శ్రీ 25 శ్రీ జనవరి శ్రీ 2026
వైద్యారోగ్య శాఖలో అవసరం లేకపోయినా డిప్యుటేషన్లు వేసి ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు
గుప్పుమంటున్నాయి. –8లో
విజయనగరం:
స్నేహితులు.. వ్యాపారులు.. ఉద్యోగులు.. నిరుద్యోగులు.. యువకులు.. విద్యార్థులు.. ప్రయా ణికులు.. బాటసారులు ఇలా ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా... వారి ముచ్చట్లకు టీ స్టాలే వేదిక. కమ్మని టీ తాగుతూ కష్టసుఖాలు.. సమస్యలకు పరిష్కారా లు.. ప్రయాణ సంగతులు.. వ్యాపార లావాదేవీలు.. ఉద్యోగ సమాచారాలు.. ఇలా.. ఒకటేమిటి.. అన్ని ముచ్చట్లకు టీ పాయింట్‌లే ఆధారంగా మారాయి. ఆధునిక రచ్చబండలుగా మారుతున్నాయి. ఒకప్పుడు నలుగురు కలిసి మాట్లాడుకోవాలంటే.. నాలుగు దారులు కలిసే చోటకు చేరేవారు. లేదంటే రచ్చబండను వేదిక చేసుకునేవారు. ఇప్పటికీ కొన్ని పల్లెల్లో ఇవి ఉన్నా.. పల్లె, పట్టణం తేడా లేకుండా టీ స్టాల్స్ అన్నింటికీ వేదిక చేసుకోవడం నయా ట్రెండ్‌గా మారింది.
ఒకప్పుడు టీ స్టాళ్లు పట్టణాలకే పరిమితం. ఊళ్లలో అసలు ఉండేవి కావు. గత పది, పదిహేనేళ్ల నుంచి పల్లెల్లోనూ ప్రత్యక్షమవుతున్నాయి. ప్రస్తుతం నగరాల్లో వీధికొకటి ఏర్పడ్డాయి. దీనికి కారణం.. ప్రతి చర్చకూ ఇది మంచి వేదికగా దొరకడమే. ఊళ్లో ఏం జరిగినా.. టీ స్టాల్ వద్దకు కచ్చితంగా చేరుతుంది. ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎవరో ఒకరు ఇక్కడికి వచ్చి అక్కడున్న నలుగురికీ ఆ విషయాన్ని చేరవేస్తారు. ఊరిలో రాజకీయ వాతావరణంపై, సమస్యల పరిష్కారానికి ఇక్కడే ఆలోచనలు మొదలవుతుంటాయి. కాస్త సమాజంపై పట్టున్న వారు ఇక్కడికొచ్చే పత్రికలు చదివి సామాజిక అంశాలపై చర్చిస్తుంటారు. యువత కూడా స్పెషల్ ఛాయ్ ఆర్డర్ చెప్పి చరవాణిలో వచ్చే విద్య, ఇతరత్రా సాంకేతిక అంశాలను పంచుకుంటారు. తమ భవిష్యత్ ప్రణాళికలను చర్చించుకుంటారు.
ఇక్కడ స్నేహితు లు, శ్రేయోభిలా షుల ద్వారా కొత్త పరిచయాలు పెరుగుతున్నా యి. ఉపాధి బాటగానూ టీ స్టాల్‌ను యువత ఎంచుకుంటోంది. రకరకాల ఫ్లేవర్లతో టీ స్టాళ్లను ఏర్పా టు చేసి ప్రస్తుత తరాన్ని ఆకర్షిస్తున్నారు. కొందరు కొన్ని బ్రాండ్ల పేరుతో ఫ్రాంచైజ్‌లనూ ఏర్పాటు చేస్తున్నారు. టీ, కాఫీ ప్రియులను ఆకర్షిస్తున్నారు. ఉపాధి పొందుతూ మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు.
గతంలో రోడ్డు వెంట టీ తాగేందుకు వెనకాడేవారు. ఆ బిడియం ఇప్పుడు లేదు. యువకులు, వ్యాపారులు, నాయకులు ఎవరైనా సరే.. కలుసుకోగానే ఇక్కడకొచ్చి టీ తాగుతూ వారికి సంబంధించిన విషయాలపై చర్చించడం అలవాటైంది. వారున్నంత సేపు సందడే. పొద్దున్నే పొలానికి, వివిధ పనులకు, ఉద్యోగాలకు వెళ్లే వాళ్లంతా ఇక్కడే మాట్లాడుకుంటున్నారు.
– సహదేవ్, టీ స్టాల్ నిర్వాహకుడు, విజయనగరం.
టీ తాగడం మానేస్తే ఆరోగ్యానికి మేలని ఒకప్పటి మాట.. కాలం మారుతున్నట్లే వాటిల్లోనూ 120కి పైగా రకాలు నేడు అందుబాటులోకి వచ్చాయి.. అంతేనా మీ అనారోగ్య ఇబ్బందులు తొలగేందుకు ’ఈ రకమైన టీ తాగండి’ అనే సలహాలు ఇస్తున్నారంటే.. ప్రాధాన్యం చెప్పనక్కర్లేదు. కార్పొరేట్ జాబితాలో చేరిన ఈ వ్యాపారం ఉమ్మడి విజయనగరం జిల్లాలో రోజురోజుకు విస్తరిస్తోంది. ఓ కప్పు టీ రకాన్ని బట్టి రూ.10 నుంచి రూ.100 వరకు ధరలు ఉన్నాయి. కిలో రూ.300 పలికే టీ పొడితో పాటు 50 గ్రాములు రూ.200 ధర పలికే టీపొడి నగరంలో వాడుకలో ఉన్నాయి. రెండు జిల్లాల్లో సుమారుగా 600 టీ స్టాల్స్ ఉన్నాయన్న అంచనా ఉండగా.. 21 కార్పొరేట్ స్థాయిల బ్రాండెడ్ దుకాణాలు ఉన్నాయి. సాధారణ టీల కంటే అల్లం, బెల్లం గ్రీన్ టీలకు ఆదరణ ఎక్కువగా ఉంది. కాఫీలోనూ బెల్లం వాడకం పెంచడంతో వాటి విక్రయాలు పెరిగాయి. మామిడి అల్లం కూడా వాడుకలోకి తెచ్చారు. అల్లం ఘాటుతో మామిడి రుచి ఉండటం దీని ప్రత్యేకత. బెల్లం, శిలాజిత్ కాఫీలకు ఆదరణ ఉంది. లాభాల మాట ఎలా ఉన్నా అవగాహన, విషయ పరిజ్ఞానం లేకుండా దిగితే నష్టాల బాట తప్పదన్నది కొందరిమాట.
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం


