విద్యార్థులకు ఉపయుక్తంగా సాక్షి స్టడీ మెటీరియల్
● సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు డీఈఓ పిలుపు
విజయనగరం అర్బన్:
పదోతరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా అందజేయడం అభినందనీయమని, వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ యు.మాణిక్యంనాయుడు సూచించారు. విజయనగరం కస్పా మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలోని పదోతరగతి విద్యార్థులకు ‘సాక్షి’ సంస్థ సమకూర్చిన గణితం, సైన్స్ సబ్జెక్టుల మెటీరియల్‌ను ఆయన ముందుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పదోతరగతి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో స్టడీమెటీరియల్ రూపొందించి, ఉచితంగా పంపిణీ చేస్తున్న ‘సాక్షి’ మీడియాకు అందరూ కృతజ్ఞతలు చెప్పాలని కోరారు. గణితం, సైన్స్ సబ్జెక్టులపై బిడియం పోగొట్టి, మరింత పట్టు సాధించేందుకు మెటీరియల్ దోహదపడుతుందన్నారు. సబ్జెక్టు టీచర్లు మాట్లాడుతూ మెటీరియల్‌ను సమయాపాలనతో చదివితే.. చదువులో వెనుకబడిన విద్యార్థులు కూడా మంచి మార్కులు సాధించవచ్చన్నారు. అనంతరం పాఠశాలలో పదోతరగతి చదువుతున్న 263 మంది పదో తరగతి విద్యార్థులకు స్టడీమెటీరియల్‌ను అందజేశారు. కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ టి.సన్యాసిరాజు, ఎంఈఓలు పి.ఆనందమూర్తి, పి.సత్యవతి, కస్పా మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల ప్రధానపాధ్యాయురాలు ఉల్లి విశాలాక్ష్మి, సబ్జెక్టు ఉపాధ్యాయులు, సాక్షి సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థులకు ఉపయుక్తంగా సాక్షి స్టడీ మెటీరియల్
విద్యార్థులకు ఉపయుక్తంగా సాక్షి స్టడీ మెటీరియల్
విద్యార్థులకు ఉపయుక్తంగా సాక్షి స్టడీ మెటీరియల్


