లీడర్.. క్యాడర్ బలంగా ఉండాలి
ఏ పార్టీకైనా లీడర్, కేడర్ బలంగా ఉండాలి. ఈ దేశంలోనే అత్యంత బలమైన లీడర్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. 2019లో జననేతగా ఒక్కరిగా వెళ్లారు. 151 సీట్లు గెలుచుకున్నారు. అదీ ఆయనకున్న జన బలం. జగన్‌మోహన్ రెడ్డి బలం ముందు నిలువలేక ఆయనను ఓడించడానికి బీజేపీ, టీడీపీ, జనసేన ముఠా కట్టాయి. ఆయనను ఢీకొట్టే బలం లేక మరో 15 ఏళ్లు ముఠాగా ఉంటామంటూ ఆ పార్టీల నేతలు చెబుతున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి వంటి మంచి లీడర్ నాయకత్వంలో పనిచేయడానికి గర్వ పడాలి. చంద్రబాబు మెడికల్ కాలేజీలు ఎవరికో కట్టబెట్టేస్తే గానీ మనం 17 కాలేజీలు కట్టామని గట్టిగా చెప్పుకోలేకపోయాం. మనమంతా జగనన్న సైన్యంగా పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించాలి. విజయనగరం వైఎస్సార్‌సీపీకి కంచుకోట. పేదల గుండె చప్పుడుగా నిలుద్దాం. ప్రతిగ్రామంలో సోషల్ మీడియా కన్వీనర్లను ని యమించి ప్రభుత్వ అక్రమాలను అడ్డుకుందాం. సీఎం చంద్రబాబు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. హాస్టల్ విద్యార్ధులకు భోజనం, నీరు పెట్టలేకపోతున్నారు. 19 నెలల కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వం అపఖ్యాతిని మూటగట్టుకుంది. వైఎస్సార్‌సీపీ హాయాంలో రాజకీయలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తే, చంద్రబాబు వైఎస్సార్‌సీపీ నాయకుల పనిచేయొద్దంటూ బహిరంగంగా చెప్పడం దిగజారుడు పాలనకు నిదర్శనం.
– కురసాల కన్నబాబు,
వైఎస్సార్‌సీపీ రీజనల్ కో ఆర్డినేటర్
చంద్రబాబు అరాచక పాలన సాగిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో నిరుపేదలకు ఇచ్చిన పింఛన్లు కోత విధిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులను కన్నీరు పెట్టిస్తున్నారు. పైగా కొత్త పింఛన్లు ఇవ్వడం లేదు. గత ప్రభుత్వంలో రైతులకు అందిన ఉచిత పంట బీమాకు మంగళం పాడేశారు. ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులకు భోజనం పెట్టలేని దుస్థితికి పాలనను దిగజార్చారు.
– పీడిక రాజన్నదొర, మాజీ డిప్యూటీ సీఎం, సాలూరు నియోజకవర్గం
లీడర్.. క్యాడర్ బలంగా ఉండాలి


