మోసగాళ్ల కొత్త పంథా
● ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
● ఎస్పీ దామోదర్
విజయనగరం క్రైమ్: మోసగాళ్లు కొంత పంథా అనుసరిస్తున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ దామోదర్ బుధవారం హెచ్చరించారు. ‘మీకు తెలిసినవారు లేక మీ ప్రాంతం వారు ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలు ఆపదలో ఉన్నారని, వేరే ప్రాంతంలో వాళ్లంతా చిక్కుకున్నారని, ప్రయాణంలో వారి బ్యాగులు, సామాన్లు పోయాయని, వారు సొంత ప్రాంతానికి రావడానికి ఇబ్బందులు పడుతున్నారని’ ఇలా కొంత మందికి ఫోన్ చేసి డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడే ముఠాలు దిగాయని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఈ తరహా మోసాల పట్ల ప్రజలు అప్ప్రమత్తంగా ఉండాలని, ఎవరికై నా ఇటువంటి ఫోన్ కాల్స్ వస్తే ముందుగా నిర్ధారించుకోవాలని అవసరమైతే స్థానిక పోలీసులను ఆశ్రయించాలని ఎస్పీ సూచించారు.


