కృషితో కుశ జలపాతం..!
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని వనకాబడి పంచాయతీ ‘కుశ’ జలపాతాన్ని కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. కుశ గ్రామానికి సమీపంలో నిత్యం పారే జీవ గెడ్డ వద్ద నెలకొన్న జలపాతం చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ సమాచారం తెలుసుకున్న కలెక్టర్ కొద్ది రోజుల క్రితం సందర్శించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దితే స్థానికులకు ఉపాధి దొరుకుతుందని గ్రామస్తులకు సూచించారు. దీంతో నడుం బిగించిన గిరిజనులు స్వయం కృషితో ముందడుగు వేశారు. శ్రమదానం చేస్తూ జలపాతం వద్దకు చేరుకునేందుకు రహదారిని మెరుగుపర్చారు.
నేడు ప్రారంభోత్సవం


