
పువ్వల నాగేశ్వరరావు మృతి
● దిగ్బ్రాంతి వ్యక్తంచేసిన మాజీ
డిప్యూటీ సీఎం రాజన్నదొర
● నివాళులర్పించిన ఎమ్మెల్సీ బొత్స,
జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
సాలూరు: వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, సాలూరు పట్టణ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్, మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ పువ్వలనాగేశ్వరరావు మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. నాగేశ్వరరావు మరణ వార్త తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం ఉదయం లక్ష్మి థియేటర్ వద్ద ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. నాగేశ్వరరావు మరణ వార్త తెలుసుకున్న ఎమ్మెల్సీ, శాసనమండలి ప్రతిపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య తదితర ప్రముఖులు సాలూరు వచ్చి నాగేశ్వరరావు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. నాగేశ్వరరావు సేవలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. నాగేశ్వరరావు సతీమణి ప్రస్తుత మున్సిపల్ చైర్‌పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ, కుమారుడు శ్రీనువాసరావు, కుమార్తె, కుటుంబీకులు, బంధువులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల విషన్నవదనాల మధ్య నాగేశ్వరరావు అంత్యక్రియలు శనివారం పూర్తయ్యాయి.

పువ్వల నాగేశ్వరరావు మృతి