
కోటదుర్గమ్మ దసరా ఆదాయం రూ.32,93,397
పాలకొండ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మ వారి ఆలయానికి దసరా ఉత్సవాల సందర్భంగా రూ.32,93,397 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో సూర్యనారాయణ గురువారం తెలిపారు.
ఇందులో హుండీల ద్వారా రూ.17,98,058 ద్వారా వచ్చిందని తెలిపారు. కుంకుమార్చనల టికెట్ల ద్వారా రూ.2,61,650, అంతరాలయం టికెట్ల ద్వారా రూ.1920, ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.3,01,400, శ్రీఘ్ర దర్శన టికెట్ల ద్వారా రూ.4,71,240ల ఆదాయం వచ్చిందని తెలిపారు. పూజలు, ఘటాలు, కేశ ఖండన తదితర ఇతర టికెట్ల ద్వారా రూ.4,62,609 ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. గత ఏడాది దసరా ఉత్సవాలకు రూ.24,47,839లు సమకూరిందని వివరించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది రూ.8,45,558 ఆదాయం అధికంగా వచ్చిందని తెలిపారు.