
నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు..!
ఈమె పేరు ఎం. పంకజాక్షి. గంట్యాడ మండలం పెదమజ్జిపాలెం. గత నెల 27న ఆమెకు విజయనగరంలోని తిరుమల మెడికవర్ ఆస్పత్రిలో నరాల సంబంధిత వ్యాధికి శస్త్రచికిత్స జరిగింది. తదుపరి చికిత్స కోసం శుక్రవారం ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రిలో ఎన్‌టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ)కి సంబంధించిన సేవలు నిలిపివేశాం. ఓపీ చూడడం లేదని అక్కడ సిబ్బంది చెప్పడంతో ఆందోళన చెందుతూ వెనుదిరిగారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు దొంతల అప్పన్న. సాలూరు మండలం జన్నివలస గ్రామం. ప్రమాదవశాత్తు పడిపోవడంతో మక్క విరిగింది. శుక్రవారం విజయనగరం తిరుమల మెడికవర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశామని చెప్పడంతో చేసేది లేక ప్రభుత్వాస్పత్రికి వెళ్లి పోయారు.

నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు..!