
అదనపు భవనాలు మంజూరైనా పూర్తి చేయని ప్రభుత్వం
కురుపాం గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినుల సౌకర్యార్థం అదనపు భవనాల నిర్మాణానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాబార్డు నిధులు రూ.1.97 కోట్లు మంజూరు చేసి 2020లో పనులకు శ్రీకారం చుట్టింది. రూ.90 లక్షల ఖర్చుతో నిర్మాణ పనులు చేపట్టింది. తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి చివరి దశలో ఉన్న భవన నిర్మాణాలను పూర్తి చేయలేక పోవడంతో విద్యార్థులకు వసతి సమస్యలు తీవ్రతరమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలోనే గురుకులానికి ఆర్వో ప్లాంట్‌ను మంజూరు చేసినా వాటి పర్యవేక్షణ సైతం గాలికి వదిలేశారు. దీంతో చిన్నారులు కలుషిత నీటి కారణంగా హెపటైటస్–ఎ బారిన పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, వందల మంది ఆస్పత్రి పాలయ్యారు.