తగ్గిన ‘మడ్డువలస’ నీటి మట్టం | - | Sakshi
Sakshi News home page

తగ్గిన ‘మడ్డువలస’ నీటి మట్టం

Nov 20 2023 12:32 AM | Updated on Nov 20 2023 12:32 AM

ఇందిరాగాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న రమేష్‌కుమార్‌ తదితరులు    - Sakshi

ఇందిరాగాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న రమేష్‌కుమార్‌ తదితరులు

వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు వద్ద నీటిమట్టం తగ్గుముఖం పడుతోంది. శనివారం ప్రాజెక్టు వద్ద 62.10 మీటర్ల నీటి మట్టం నమోదైంది. వాస్తవానికి ప్రాజెక్టు కెపాసిటీ 65 మీటర్లు లెవెల్‌ ఉండాల్సి ఉండగా అధికారులు నీటి నిల్వలను తగ్గిస్తున్నారు. సువర్ణముఖి, వేగావ తి నదుల నుంచి 778 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ఒక గేటు ఎత్తి 1410 క్యూసెక్కుల నీటిని కిందకు విడిచి పెడుతున్నారు. కుడి ప్రధాన కాలువ ద్వారా సాగునీటి అవసరాల కోసం 700 క్యూసెక్కుల నీటిని ఆయకట్టు భూములకు మళ్లిస్తున్నారు. దీంతో ప్రాజెక్టు వద్ద నీటి నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ప్రాజెక్టు వద్ద 62.10 మీటర్ల లెవెల్‌ నీటి నిల్వ నమోదైంది.

పది వేల టన్నుల చెరకు క్రషింగ్‌

రేగిడి : మండలంలోని సంకిలి ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారంలో ఇప్పటి వరకూ పది వేల టన్నుల చెరకు క్రషింగ్‌ పూర్తయినట్టు అసోషి యేటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పట్టాభి రామిరెడ్డి ఆదివారం వెల్లడించారు. విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాల నుంచి చెరకును నరికేందు కు తుని, అన్నవరం, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి కూలీలు తీసుకొచ్చినట్టు వెల్లడించారు. కటింగ్‌ ఆర్డర్లు పొందిన రైతుల పొలా ల్లో వీరు కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన చెరకును నరికి ఫ్యాక్టరీకి అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది 4.10 లక్షల మెట్రిక్‌ టన్నుల చెరకు క్రషింగ్‌ లక్ష్యం చేసుకున్నామని పేర్కొన్నారు.

భారతదేశ గొప్పతనాన్ని చాటిన ధీశాలి ఇందిరాగాంధీ

డీసీసీ అధ్యక్షుడు రమేష్‌కుమార్‌

విజయనగరం ఫోర్ట్‌: భారతదేశ గొప్పతనాన్ని చాటిన ధీశాలి ఇందిరాగాంధీ అని డీసీసీ అధ్యక్షుడు సరగడం రమేష్‌కుమార్‌ పేర్కొన్నారు. స్థానిక డీసీసీ కార్యాలయంలో ఆదివారం మా జీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశాన్ని సమర్ధవంతంగా పాలించిన వీర వనిత ఇందిరాగాంఽధీ అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఎన్‌.శ్రీనివాసరావు, సిహెచ్‌.శ్రీనివాసరావు, చంద్రశేఖర్‌, రాజు, సురేష్‌ పాల్గొన్నారు.

సైనిక్‌ స్కూల్‌ విద్యతో

ఉత్తమ పరివర్తన

విజయనగరం అర్బన్‌: సైనిక్‌ స్కూల్‌లో విద్యా బోధనలతో విద్యార్థుల్లో ఉత్తమ పరివర్తన సాధ్యమని ఎస్‌జీఎస్‌ సైనిక్‌ అకాడమీ డైరెక్టర్‌ ఎస్‌.రామ్‌ అన్నారు. సైనిక్‌ స్కూల్‌లో విద్యా బోధనలపై తల్లిదండ్రులకు స్థానిక అకాడమీ ప్రాంగణంలో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 33 సైనిక్‌ స్కూళ్లు ఉన్నాయని వాటిలో విద్యాబోధన ఆదర్శంగా ఉంటుందన్నారు. ఒత్తిడి లేని విద్యా బోధనతో పాటు వ్యక్తిత్వ వికాసానికి, క్రీడలు, క్లరికల్‌ ఏక్టి విటీలకు ప్రాధాన్యత ఇస్తారని రామ్‌ అన్నారు. ప్రవేశ పరీక్ష రాసే ముందు ఆయా స్కూళ్ల నిర్వాహణ వాతావరణాన్ని విద్యార్థులకు తల్లిదండ్రులు అవగాహన కలిగిస్తే మంచి ఫలితాలను సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ప్రాజెక్టు వద్ద 62.10 మీటర్ల నీటి నిల్వ  1
1/3

ప్రాజెక్టు వద్ద 62.10 మీటర్ల నీటి నిల్వ

ఫ్యాక్టరీకి తరలించేందుకు ట్రాక్టర్‌కు ఎక్కిస్తున్న చెరకు  2
2/3

ఫ్యాక్టరీకి తరలించేందుకు ట్రాక్టర్‌కు ఎక్కిస్తున్న చెరకు

సదస్సులో మాట్లాడుతున్న ఎస్‌జీఎస్‌ 
అకాడమీ డైరెక్టర్‌ ఎస్‌.రామ్‌ 
3
3/3

సదస్సులో మాట్లాడుతున్న ఎస్‌జీఎస్‌ అకాడమీ డైరెక్టర్‌ ఎస్‌.రామ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement