
వీడియో కాన్ఫెరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్ నాగలక్ష్మి, జేసీ మయూర్ అశోక్
విజయనగరం అర్బన్: అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని, 18 ఏళ్లు దాటిన వారి ఓటు నమోదు శాతం పెరగాలని, ఓటర్ల సవరణ ప్రక్రియలో వచ్చిన ఫారం 6, 7, 8లను 15 రోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. 15 రోజులు దాటి దరఖాస్తుకు పరిష్కారం చూపనివారికి నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ శుక్రవారం మాట్లాడారు. 6, 7, 8 క్లెయిమ్‌ల పరిష్కారం, ఓటర్లు జనాభా నిష్పత్తి, సీ్త్ర పురుష ఓటర్ల నిష్పత్తి, ఎపిక్ కార్డుల జనరేషన్, వార్తా పత్రికల్లో వచ్చిన ప్రతికూల వార్తలపై చర్యలు తదితర అంశాలపై సమీక్షించారు. అనామోలిస్ ఫారాలన్నీ నవంబర్ 30 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. 18, 19 సంవత్సరాల ఓటర్ల సంఖ్య జిల్లాలో తక్కువగా ఉందని, అర్హతగల యువకులు 6,800 మందిని తక్షణమే ఓటర్లుగా చేర్పించాలన్నారు. వచ్చే వారం రోల్ అబ్జర్వర్ శ్యామలరావు జిల్లాలో పర్యటించనున్నారని, బీఎల్‌ఓలందరూ వారి వద్ద ఉన్న రిజిస్టర్‌లన్నీ అప్డేట్ చేసుకోవాలని సూచించారు. డిసెంబర్ నెలలో రెండు రోజులపాటు ఎన్నికల కమిషన్ అధికారులు జిల్లాలో పర్యటిస్తారన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ మయూర్‌అశోక్, డీఆర్వో అనిత, ఈఆర్‌ఓలు వెంకటేశ్వరరావు, సుధారాణి, నూకరాజు, ఎన్నికల విభాగం ఏఓ శ్రీకాంత్, డీటీలు పాల్గొన్నారు.
ఫారం 6, 7, 8లను పరిష్కరించాలి
ఎన్నికల సిబ్బందికి సూచించిన కలెక్టర్
నాగలక్ష్మి

పాల్గొన్న మండల స్థాయి అధికారులు