డాబాగార్డెన్స్: దాదాపు ఆరు నెలల తర్వాత గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)కు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మేయర్ రిజర్వేషన్‌తో పాటు వార్డుల రిజర్వేషన్లను ప్రకటించింది. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని జనరల్ మహిళకు కేటాయించింది. వార్డుల విషయానికొస్తే మొత్తం 120 వార్డుల్లో ఎస్సీ, ఎస్టీలకు 11 వార్డులు, బీసీలకు 49 వార్డులు, జనరల్ మహిళకు 31 వార్డులు, రిజర్వ్‌డ్ కేటగిరీలో 29 వార్డులను కేటాయించింది.
వార్డుల రిజర్వేషన్ ఇలా..
ఎస్టీ జనరల్‌కు ఒకటి, ఎస్సీ జనరల్‌కు 5, ఎస్సీ మహిళకు 5 వార్డులు కేటాయించారు. బీసీ జనరల్‌కు 25, బీసీ మహిళకు 24, జనరల్ మహిళకు 31 వార్డులు రిజర్వ్ చేశారు. మరో 29 వార్డులను అన్‌రిజర్వ్‌డ్‌గా ప్రకటించారు.గ్రేటర్ ఎన్నికల్లో 18,29,966 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జీవీఎంసీ పరిధిలోని 10 జోన్లలో 1,990 పోలింగ్ కేంద్రాలు, 14,328 మంది పోలింగ్ సిబ్బందిని నియమించేలా జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ చర్యలు చేపట్టారు. ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఆయన, ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.
స్వర్ణభారతిలో ఎన్నికల సామగ్రి భద్రం
ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, ఇతర ఎన్నికల సామగ్రిని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో భద్రపరిచారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సుల భద్రత కోసం స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ కేంద్రాలను గుర్తించారు. కౌంటింగ్ కోసం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలోని ప్రిన్సిపల్ బ్లాక్, న్యూ క్లాస్ రూమ్ కాంప్లెక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం భవనాలను సిద్ధం చేశారు.
గ్రేటర్ మేయర్‌గా జనరల్ మహిళకు కేటాయింపు వార్డుల్లోనూ 50 శాతం మహిళలకే... 120 వార్డుల్లో 60 వార్డులు మహిళలకే ఎస్టీకి–1, ఎస్సీలకు–10, బీసీలకు 49, మహిళ జనరల్‌కు 31, రిజర్వ్‌డ్‌గా 29 వార్డుల కేటాయింపు


