మహారాణిపేట: రానున్న గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని వర్గాలకు సముచిత స్థానం ఉంటుందని, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న నాయకులకు ప్రాధాన్యత కల్పిస్తామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో నాయీబ్రాహ్మణ, శెట్టి బలిజ, ఇతర కుల సంఘాల నాయకులు, జిల్లా సంఘాల ప్రతినిధులు, రానున్న ఎన్నికల్లో వివిధ వార్డుల నుంచి పార్టీ తరఫున పోటీ చేయాలని ఆశిస్తున్న నాయకులు సోమవారం కలిసి తమ అభిప్రాయాలు, విజ్ఞప్తులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ జీవీఎంసీ ఎన్నికల్లో అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ, పార్టీ విజయానికి అందరూ సమష్టిగా కృషి చేయాలని సూచించారు. అనంతరం పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులకు ఐడీ కార్డులు అందజేశారు. పార్టీ కమిటీల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులకు అధికారిక గుర్తింపు కల్పించడంతో పాటు, పార్టీ కార్యక్రమాల్లో వారి పాత్రను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ ఐడీ కార్డులు ఉపయోగపడతాయన్నారు. మిగిన రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులకు ఐడీ కార్డులు విడతల వారీగా అందజేస్తామన్నారు. సమావేశంలో సమన్వయకర్తలు తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, సీఈసీ సభ్యుడు కోలా గురువులు, పార్టీ నాయకులు కట్టుమూరి సతీష్, బాణాల శ్రీనివాసరావు, రెయ్యి వెంకటరమణ, పీలా వెంకటలక్ష్మి, అనిల్ కుమార్‌రాజు, పీవీ సురేష్, చెన్నా జానకిరామ్, ఉరుకూటి రామచంద్రరావు, మహమ్మద్ ఇమ్రాన్, బర్కత్ అలీ, బల్లా లక్ష్మణ్, గుండపు నాగేశ్వరవు, ప్రసాద్ రాజు, శ్రీదేవివర్మ, కృపా, ప్రేమ్‌కిరణ్, ఉమామహేష్, రాజబాబు, మార్కండేయులు, మనోజ్, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు


