ఏయూ ఇన్‌చార్జి వీసీ నియామకం | - | Sakshi
Sakshi News home page

ఏయూ ఇన్‌చార్జి వీసీ నియామకం

Oct 13 2026 1:11 AM | Updated on Oct 13 2026 1:11 AM

● ఏయూ వీసీ అమెరికా ప్రయాణం వివాదం.. దిగొచ్చిన ప్రభుత్వం ● రెక్టార్‌ ఆచార్య పీ.కింగ్‌ను నియమిస్తూ జీవో విడుదల

విశాఖ విద్య: ఆంధ్రా యూనివర్సిటీ పాలనలోపాలను ఎత్తిచూపుతూ ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన ‘ఏయూ వీసీ అమెరికా ప్రయాణం వివాదం’ కథనంపై ప్రభుత్వం స్పందించింది. వీసీ విదేశీ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో పాలనా బాధ్యతలను మరొకరికి అప్పగించకపోవడంపై వచ్చిన విమర్శల నేపథ్యంలో సోమవారం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. యూనివర్సిటీస్‌ యాక్ట్‌ ప్రకారం ఏయూ రెక్టార్‌కు ఇన్‌చార్జ్‌ వీసీ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్‌ కార్యాలయం తరఫున ప్రిన్సిపల్‌ సెక్రటరీ (ఎఫ్‌ఏసీ) జే. శ్యామలరావు పేరుతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏయూ వీసీ ఆచార్య రాజశేఖర్‌ ఈ నెల 8 నుంచి అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన పర్యటన ముందుగానే ఖరారైనప్పటికీ, ప్రభుత్వానికి తగిన సమాచారం అందించడంలో నిర్లక్ష్యం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. వీసీ గైర్హాజరులో వర్సిటీ పాలనా బాధ్యతలను మరొకరికి అప్పగించాల్సి ఉన్నా ఆ ప్రక్రియ జరగలేదని విద్యార్థి, ఉద్యోగ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

నాలుగు రోజుల తర్వాత జీవోపై విమర్శలు

వీసీ అమెరికా పర్యటన ప్రారంభమైన నాలుగు రోజుల తర్వాత ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏయూ పాలన వ్యవహారాలపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి సారించడం లేదని ఏయూ పరిరక్షణ సమితి నేత డాక్టర్‌ మీనన్‌ విమర్శించారు. ఏయూ రెక్టార్‌ ఆచార్య పులిపాటి కింగ్‌ ఇన్‌చార్జ్‌ వీసీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 19వ తేదీ వరకు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. వీసీ ఆచార్య రాజశేఖర్‌ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఆచార్య పులిపాటి కింగ్‌ రెక్టార్‌గా తన బాధ్యతలను కొనసాగిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement