గురునాథరావు సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

గురునాథరావు సేవలు చిరస్మరణీయం

Oct 12 2026 8:28 AM | Updated on Oct 12 2026 8:28 AM

డాబాగార్డెన్స్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలతో పాటు విశాఖ ప్రాంత అభివృద్ధికి గుడివాడ గురునాథరావు అందించిన సేవలు చిరస్మరణీయమని రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పేర్కొన్నారు. గురునాథరావు జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలోని వైఎస్సార్‌ పార్కు వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో గురునాథరావుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఆయన కేవలం నాయకుడిగానే కాకుండా ప్రజల మనిషిగా గుర్తింపు పొందారని, నిరంతరం ప్రజల కోసం శ్రమించారని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్‌, కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌, సమన్వయకర్తలు బొత్స అనూష, తిప్పల దేవన్‌రెడ్డి, ఉత్తరాంధ్ర జోన్‌–1 మహిళా విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఈర్లె అనురాధ, నాయకులు యల్లపు రఘురాం, ఫారూఖీ, గండి రవికుమార్‌, జహీర్‌ అహ్మద్‌, పేడాడ రమణకుమారి, పీవీ సురేష్‌, ద్రోణంరాజు శ్రీవత్సవ్‌, పల్లా దుర్గారావు, అల్లంపల్లి రాజుబాబు, పీవీ నారాయణ, దొడ్డి కిరణ్‌, శశికళ, పి.సుజాత, బిపిన్‌కుమార్‌ జైన్‌, దేవరకొండ మార్కండేయలు, రాజేష్‌ ఖన్నా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement