తండ్రితో గొడవ.. నిప్పంటించిన కొడుకు | - | Sakshi
Sakshi News home page

తండ్రితో గొడవ.. నిప్పంటించిన కొడుకు

Oct 12 2026 8:28 AM | Updated on Oct 12 2026 8:28 AM

పీఎం పాలెం: చంద్రంపాలెంలో తండ్రితో గొడవ పడిన కుమారుడు గ్యాస్‌ సిలిండర్‌కు నిప్పంటించడంతో ఇంట్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తండ్రీకొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తండ్రి మృతి చెందగా, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రంపాలెంలో నివాసం ఉంటున్న సోమిరెడ్డి గోవిందరావు (50) భార్య నుంచి విడిపోయి గత ఐదేళ్లుగా కుమారుడు త్రినాథ్‌తో కలిసి జీవిస్తున్నాడు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే తనకు ఎలాంటి ఆధారం ఇవ్వడం లేదంటూ త్రినాథ్‌ తరచూ తండ్రితో గొడవ పడేవాడని స్థానికులు తెలిపారు. ఇదే విషయంపై ఆదివారం మధ్యాహ్నం నుంచి తండ్రీకొడుకుల మధ్య గొడవ జరగడంతో సాయంత్రం 5.30 గంటల సమయంలో త్రినాథ్‌ తండ్రిని ఇంట్లో ఉంచి గ్యాస్‌ సిలిండర్‌ను విప్పి నిప్పంటించాడు. దీంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో త్రినాథ్‌ కూడా మంటల్లో చిక్కుకున్నాడు. ఇంటి నుంచి పొగలు రావడాన్ని గమనించిన చుట్టుపక్కల వారు తలుపులు బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించారు. అప్పటికే తండ్రీకొడుకులు తీవ్రంగా కాలిపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తండ్రి గోవిందరావు మృతి చెందగా, కుమారుడు త్రినాథ్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాలిన గాయాలతో తండ్రి గోవిందరావు

కాలిన గాయాలతో కొడుకు త్రినాథ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement