బీసీలకు బాబు వెన్నుపోటు | - | Sakshi
Sakshi News home page

బీసీలకు బాబు వెన్నుపోటు

Oct 9 2026 2:14 AM | Updated on Oct 9 2026 2:14 AM

సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ ‘వెన్నుపోటు’ రాజకీయాన్ని, బీసీలకు జరిగిన వంచనను ఎండగట్టేందుకు ఈ నెల 16న విశాఖలో నిర్వహించనున్న ‘బీసీ గర్జన’ను విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర జోన్‌–1 పరిధిలో బీసీ గర్జన సన్నాహక సమావేశాన్ని గురువారం ఎండాడలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉత్తరాంధ్రలోని బీసీ నేతల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. రాష్ట్రంలోని 139 బీసీ కులాల సమస్యలను తెలుసుకుని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై చర్చించారు. ఎన్నికలకు ముందు కూటమి ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు జరిగిన అన్యాయం, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో బీసీలకు అందిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని నేతలు సూచించారు.

మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ధర్మాన

బీసీల పార్టీగా చెప్పుకొనే టీడీపీ.. బీసీలకు చేసింది మోసం, దగా తప్ప మరేమీ లేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో బీసీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీసీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. ప్రభుత్వ భూములను కారుచౌకగా కేటాయిస్తున్నారని, విశాఖలో ఇటీవల 16 హోటళ్లకు ప్రభుత్వ భూములు కేటాయించిన అంశాన్ని ప్రజలకు వివరించాలన్నారు. బీసీలకు విద్య, వైద్యం అందని పరిస్థితి నెలకొందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసి, బీసీల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

మేలు కన్నా మోసమే ఎక్కువ: బొత్స

నాలుగు దఫాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు బీసీలకు చేసిన మేలు కన్నా మోసమే ఎక్కువని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు చారిత్రాత్మక మేలు చేశారని అన్నారు. 2019లో బీసీ గర్జనలో ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో చేర్చి అమలు చేశామని గుర్తుచేశారు. సర్పంచ్‌ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బీసీ కమిటీలను సమన్వయం చేసుకుని గర్జనను విజయవంతం చేయాలని కోరారు.

ఎన్నికల వేళ కొత్త డ్రామా: రమేష్‌ యాదవ్‌

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు మరోసారి బీసీలను మభ్యపెట్టేందుకు కొత్త డ్రామాకు తెరలేపారని పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చట్టసభల్లో బీసీలకు పెద్దపీట వేశామని, 14 కార్పొరేషన్లను 56కు పెంచి 672 మందికి చైర్మన్‌, డైరెక్టర్‌ పదవులు ఇచ్చామని తెలిపారు.

బీసీలంటే చులకన: తమ్మినేని

చంద్రబాబు, ఆయన అనుచరులకు బీసీలంటే చులకన భావమని మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. బలహీన వర్గాలమైనా బలహీనులం కాదని గతంలోనే నిరూపించామని, వెన్నుపోటు రాజకీయాలపై బీసీలంతా గళం విప్పాలని పిలుపునిచ్చారు.

20 ఏళ్ల పాలనలో అన్యాయం: బూడి

చంద్రబాబు ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 20 ఏళ్లు పాలించినా బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. 2014లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, 2024లోనూ మరోసారి బీసీలను మోసం చేశారని అన్నారు. టీడీపీ బీసీల పార్టీ కాదని, వంచించిన పార్టీ అని ధ్వజమెత్తారు.

బీసీలకు వైఎస్సార్‌సీపీ పెద్దపీట: చెల్లుబోయిన

చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య ఒక్క బీసీకి మాత్రమే డిప్యూటీ సీఎం పదవి ఇస్తే, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నలుగురు బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చామని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతానికి పైగా అవకాశాలు కల్పించామని చెప్పారు.

కాలర్‌ పట్టుకుని నిలదీయాలి: వరుదు కల్యాణి

బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని కూటమి ప్రభుత్వాన్ని ఇప్పుడు బీసీలంతా కలిసి నిలదీయాలని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు మంత్రులు ఢిల్లీకి వెళ్లి డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. బీసీలకు జగన్‌ చేసిన మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

139 కులాలను ఓన్‌ చేసుకోవాలి: వాసుపల్లి

బీసీల్లోని 139 కులాలను ఓన్‌ చేసుకుని, కులాల వారీగా సమస్యలను పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందించాలని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ అన్నారు. భూసేకరణలో మత్స్యకారులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 2029లో జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉందన్నారు.

సంఘటిత శక్తిగా ఎదగాలి: ధర్మాన కృష్ణదాస్‌

బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసినా చంద్రబాబు జీవోలు ఇచ్చి మరోసారి మోసం చేస్తున్నారని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో ఈ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

బీసీలను చైతన్యపరచాలి: సీదిరి

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చట్టసభల్లో 50 శాతానికి పైగా ప్రాతినిధ్యం కల్పించామని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని కోరారు.

నర్సీపట్నం నుంచే గర్జన ప్రారంభించాలి: పెట్ల

ఉత్తరాంధ్రలో అత్యధిక బీసీలు ఉన్న నర్సీపట్నం నుంచి నియోజకవర్గ స్థాయి బీసీ గర్జనను ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ కోరారు. 2019లో జగన్‌ ప్రచారయాత్ర నర్సీపట్నం నుంచే ప్రారంభమైన విషయాన్ని గుర్తుచేశారు.

మన హక్కుల కోసం పోరాడదాం: బొడ్డేడ

బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని కూటమి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అన్ని బీసీ కులాలు ఐక్యంగా పోరాడాలని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ పిలుపునిచ్చారు. ఈ నెల 16న జరిగే ఉత్తరాంధ్ర జోన్‌–1 బీసీ గర్జనకు ప్రతి బీసీ నాయకుడు, కార్యకర్త బాధ్యత తీసుకుని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, తిప్పల నాగిరెడ్డి, అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌, తైనాల విజయ్‌కుమార్‌, తిప్పల గురుమూర్తి రెడ్డి, బొత్స అప్పలనర్సయ్య, శోభా హైమావతి, సమన్వయకర్తలు బొత్స అనూష, మొల్లి అప్పారావు, తిప్పల దేవన్‌రెడ్డి, బీసీ సెల్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రమణ, మాజీ మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతి, సీఈసీ సభ్యులు రొంగలి జగన్నాథం, కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్ళులు గండి రవికుమార్‌, పైలా శ్రీనివాసరావు, పైలా సన్యాసిరాజు, ముఖ్యనేతలు కొండా రాజీవ్‌, యల్లపు రఘురామ్‌, గొలగాని శ్రీనివాస్‌, రామన్నపాత్రుడు, మెంటాడ స్వరూప్‌, పేడాడ రమణికుమారి, అంబటి శైలేష్‌, బొడ్డెపల్లి పద్మజ, వివిధ జిల్లాల బీసీ సెల్‌ అధ్యక్షలు సనపల రవీంధ్ర భరత్‌, పిల్లి సుజాత, ఆడారి దివ్యకళ, నరసింహమూర్తి, అశోక్‌, మామిడి శ్రీకాంత్‌, దొడ్డి కిరణ్‌, అందవరపు సూరిబాబు, ఎర్ని ధనుంజయ్‌ పాల్గొన్నారు.

హామీలతో మభ్యపెట్టి..

అధికారంలోకి వచ్చాక మోసం

వైఎస్సార్‌సీపీ హయాంలోనే

బీసీలకు పెద్దపీట

వైఎస్సార్‌సీపీ నేతలు బొత్స, ధర్మాన

16వ తేదీన విశాఖలో

ఉత్తరాంధ్ర జోన్‌–1 బీసీ గర్జన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement