దసరాకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు | - | Sakshi
Sakshi News home page

దసరాకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

Oct 9 2026 2:14 AM | Updated on Oct 9 2026 2:14 AM

డాబాగార్డెన్స్‌: దసరా సందర్భంగా విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు తెలిపారు. ఈ నెల 9 నుంచి 22వ తేదీ వరకు విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు 420 ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు చెప్పారు. ప్రయాణికుల రద్దీని బట్టి అవసరమైన మేరకు మరిన్ని బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. విజయనగరం జోన్‌లోని ఆరు జిల్లాల్లోనూ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సుమారు 1,100 బస్సులు నడపనున్నట్టు తెలిపారు. ప్రత్యేక సర్వీసులకు కూడా సాధారణ చార్జీలే వసూలు చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement