స్టీల్‌ప్లాంట్‌ ఎల్‌ఎంఎం విభాగం పునఃప్రారంభం | - | Sakshi
Sakshi News home page

స్టీల్‌ప్లాంట్‌ ఎల్‌ఎంఎం విభాగం పునఃప్రారంభం

Oct 9 2026 2:14 AM | Updated on Oct 9 2026 2:14 AM

ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్‌లోని లైట్‌ అండ్‌ మీడియం మర్చంట్‌ మిల్‌ (ఎల్‌ఎంఎం)లో ఉత్పత్తి ఐదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత గురువారం పునఃప్రారంభమైంది. రోలింగ్‌ మిల్స్‌లోని ఆరు విభాగాల్లో ఫినిష్డ్‌ ప్రొడక్ట్‌ ఉత్పత్తి జరగడానికి కోక్‌ఓవెన్‌ గ్యాస్‌ అత్యంత కీలకమైనది. అయితే, గతంలో కోక్‌ఓవెన్స్‌ విభాగంలో పుషింగ్స్‌ గణనీయంగా తగ్గిపోవడంతో ఎల్‌ఎంఎం మిల్‌కు అవసరమైన గ్యాస్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఈ విభాగంలో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం కోక్‌ఓవెన్‌ గ్యాస్‌ సరఫరా పునరుద్ధరించడంతో, ఎల్‌ఎంఎం పరిధిలోని బిల్లెట్‌ మిల్‌ ఫర్నేస్‌ను లైటప్‌ చేశారు. చిన్నపాటి సాంకేతిక అంతరాయాలు ఉన్నప్పటికీ ఫర్నేస్‌ హీటింగ్‌ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మరో మూడు రోజుల్లో ఇక్కడ పూర్తిస్థాయి ఉత్పత్తి ప్రారంభం కానుంది. గ్యాస్‌ సరఫరా స్థిరంగా ఉంటే, ఆ తర్వాత బార్‌ మిల్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement