నేడు పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్
మహారాణిపేట: కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ వ్యక్తిగత పను ల నిమిత్తం సెలవు తీసుకున్నారు. మూడు రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆదివారం నుంచి 5వ తేదీ వరకు కలెక్టర్‌కు సెలవు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కాలానికి ఇన్‌చార్జి కలెక్టర్‌గా జేసీ జి. విద్యాధరిని నియమించారు. సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కూడా ఇన్‌చార్జి కలెక్టర్ నిర్వహించనున్నారు.
ఇన్‌చార్జి కలెక్టర్‌గా జేసీ విద్యాధరి
మహారాణిపేట: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జి కలెక్టర్ జి. విద్యాధరి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కార్యక్రమాలు జరుగుతాయని, రెవెన్యూ అధికారులతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను పూర్తి వివరాలతో సమర్పించాలని సూచించారు. అలాగే ‘మీ కోసం’ కాల్ సెంటర్–1100 సేవలు, సంబంధిత వెబ్‌సైట్‌ను వినియోగించుకోవాలని కోరారు.


