గాజువాక: గాజువాక కోర్టు కాంప్లెక్స్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన సీనియర్ సివిల్ జడ్జి కోర్టులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోర్ట్‌ఫోలియో జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు త్వరితగతిన, పారదర్శకమైన సత్వర న్యాయాన్ని అందించడమే లక్ష్యంగా ఈ నూతన కోర్టులను అందుబాటులోకి తెచ్చామని, బాధితులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రిన్సిపల్ జడ్జి చిన్నంశెట్టి రాజు, 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్.ఎం.ఫణికుమార్, గాజువాక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.వేణు, కార్యదర్శి కె.జ్యోతితో పాటు పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.


