సాక్షి, విశాఖపట్నం: బీజేపీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి పెద్దింటి మహేష్‌తో పాటు సుమారు 100 మంది నాయకులు, కార్యకర్తలు సోమవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. మద్దిలపాలెంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో 47వ వార్డు అధ్యక్షుడు కుందిరి సుకుమార్, ఉపాధ్యక్షుడు బంగారి సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కేకే రాజు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ సిద్ధాంతాలను విశ్వసించి పార్టీలో చేరిన వారందరికీ స్వాగతం పలికారు. వారి చేరికతో 47వ వార్డులో పార్టీ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీల అమలుపై కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందని, భవిష్యత్తులో మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. పార్టీలో చేరిన వారిలో బీజేపీ నాయకులు పెద్దింటి కనకరాజు, రావుపల్లి రాజశేఖర్, రాజన హరీష్, సుండిబాలు, రాజన సురేంద్ర, గండి వంశీ, రాజన చంటి, సొండి రమేష్, పెద్దింటి పెంటమ్మ, సుండి కాసులమ్మ, దేపల్లి నిర్మల, గండి స్వాతి, దీప్తి,సుండి లడ్డమ్మ, మరియమ్మ, సుజనమ్మ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, పార్టీ సమన్వయకర్తలు తిప్పల దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, మాజీ మంత్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, పార్టీ పర్యవేక్షకుడు గుడిమెట్ల రవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


