విశాఖ స్పోర్ట్స్ : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా ప్రాముఖ్యతను చాటిచెబుతూ, పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా మంగళవారం ముడసర్లోవలోని ఈస్ట్‌పాయింట్ గోల్ఫ్ క్లబ్ ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ మాట్లాడుతూ యోగా ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతో పాటు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం కలుగుతుందన్నారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దేశంలోని ప్రముఖ గోల్ఫ్ కోర్స్‌లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్డుపై వేలాది మంది పాల్గొనే భారీ యోగా ప్రదర్శన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎంపీ ఎం. శ్రీభరత్ మాట్లాడుతూ యోగా ప్రాముఖ్యతను ప్రజల్లో విస్తృతంగా చాటడమే ఇటువంటి కార్యక్రమాల లక్ష్యమన్నారు. కార్యక్రమంలో జేసీ విద్యాధర, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఏపీ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సతీష్‌కుమార్, జిల్లా అధికారులు, హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, గోల్ఫ్ క్లబ్ సభ్యులు పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం యోగా గురువులకు, ప్రజ్ఞా యోగా ప్రదర్శించిన చిన్నారులకు జ్ఞాపికలు అందజేశారు.
కలెక్టర్ అభిషిక్త్ కిశోర్


