డెత్‌ వారెంట్‌! | - | Sakshi
Sakshi News home page

డెత్‌ వారెంట్‌!

Jun 17 2026 12:22 AM | Updated on Jun 17 2026 12:22 AM

8లో

న్యూస్‌రీల్‌

ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందించాలి
సేఫ్టీ సర్టిఫికెట్‌
కాగితాలపైనే ‘సేఫ్టీ’.. ఉక్కులో అంతా డొల్ల

బుధవారం శ్రీ 17 శ్రీ జూన్‌ శ్రీ 2026

యోగా దినోత్సవాన్ని

విజయవంతం చేయాలి

మహారాణిపేట: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం–2026 సందర్భంగా జిల్లాలో నిర్వహించనున్న ‘యోగాంధ్ర’ వేడుకలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవా న్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పలు థీమాటిక్‌ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన కార్యక్రమాన్ని అదే రోజు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ఆర్కే బీచ్‌లోని కాళీమాత ఆలయం నుంచి విక్టరీ ఎట్‌ సీ వరకు భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమాల నిర్వహణకు నియమితులైన నోడల్‌ అధికారులు, వేదిక ఇన్‌చార్జ్‌లు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.

సాక్షి, విశాఖపట్నం: ఉదయం నవ్వుతూ విధులకు వెళ్లిన వారు.. సాయంత్రానికి గుర్తుపట్టలేనంతగా కాలిపోయి శవాలుగా ఇంటికి చేరుతుంటే ఆ కుటుంబాల రోదనలు ఉక్కునగరాన్ని కలచివేస్తున్నాయి. ఇది ఒక్కరోజు జరిగిన విషాదం కాదు. విశాఖ ఉక్కు కర్మాగారంలో 2011 నుంచి వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాల పరంపరలో మరో విషాద అధ్యాయం మాత్రమే. భద్రతా లోపాలపై అనేక అధికారిక నివేదికలు, కార్మిక సంఘాల హెచ్చరికలు వచ్చినప్పటికీ యాజమాన్యం వైఖరిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. ప్రైవేటీకరణ ప్రతిపాదనలు తెరపైకి వచ్చిన తర్వాత పరిస్థితి మరింత దిగజారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్లాంట్‌ భద్రత అంశాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో కార్మికుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అంతర్జాతీయ సేఫ్టీ సర్టిఫికెట్లు సాధించామని యాజమాన్యం చెబుతున్నప్పటికీ.. ఆ భద్రత కాగితాలకే పరిమితమైందనే విషయాన్ని తాజా విషాదం మరోసారి బహిర్గతం చేసింది.

సీఎస్‌ఈ హెచ్చరికలకూ మారని తీరు

2012 జూన్‌ 13 విశాఖ స్టీల్‌ప్లాంట్‌ చరిత్రలో చెరగని విషాదంగా మిగిలిపోయింది. జరిగిన భారీ పేలుడు, అగ్నిప్రమాదంలో 19 మంది సజీవదహనమయ్యారు. అప్పటి యాజమాన్యం దానిని యాదృచ్ఛిక ప్రమాదంగా పేర్కొన్నప్పటికీ, ప్రముఖ పర్యావరణ అధ్యయన సంస్థ ‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ (సీఎస్‌ఈ) మాత్రం తన నివేదికలో అది తీవ్రమైన భద్రతా వైఫల్యాల ఫలితమేనని స్పష్టం చేసింది. అంతేకాకుండా దేశంలోని 13 ప్రధాన ఉక్కు కర్మాగారాల భద్రతా ప్రమాణాలను పరిశీలించిన సీఎస్‌ఈ.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు అత్యల్ప రేటింగ్‌ ఇచ్చింది. అయినప్పటికీ యాజమాన్యం మాత్రం సర్టిఫికెట్లు, ప్రమాణాల పేరుతో భద్రతా లోపాలను కప్పిపుచ్చుకుంటూ వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నిలిచిపోయిన ప్రివెంటివ్‌ మెయింటెనెన్స్‌

భారీ పరిశ్రమల్లో నిరంతర నిర్వహణ పనులు కార్మికుల భద్రతకు కీలకం. అయితే విశాఖ ఉక్కులో గత కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ తీవ్రంగా దెబ్బతిన్నట్లు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిధుల కొరత కారణంగా అరిగిపోయిన కన్వేయర్‌ బెల్టులు, తుప్పుపట్టిన గ్యాస్‌ పైప్‌లైన్లు, కాలం చెల్లిన పరికరాల మార్పిడి పనులు వాయిదా పడుతున్నాయని చెబుతున్నాయి. స్పేర్‌ పార్ట్స్‌ కొనుగోలుకు కూడా తగిన బడ్జెట్‌ లేకపోవడంతో పాత పరికరాలతోనే వ్యవస్థను నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. నివురుగప్పిన నిప్పులా పేరుకుపోతున్న ఈ సమస్యలే ఇటీవల వరుస ప్రమాదాలకు కారణమవుతున్నాయని కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.

కాంట్రాక్టు కార్మికులతో ప్రమాదకర పనులు

మరోవైపు పదవీ విరమణలు, వీఆర్‌ఎస్‌ల కారణంగా ప్లాంట్‌లో అనుభవజ్ఞులైన ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కొత్త నియామకాలు లేకపోవడంతో ఖాళీలను కాంట్రాక్టు కార్మికులతో భర్తీ చేస్తున్నారు. బ్లాస్ట్‌ ఫర్నేస్‌, స్టీల్‌ మెల్టింగ్‌ షాప్‌ (ఎస్‌ఎంఎస్‌) వంటి అత్యంత ప్రమాదకర విభాగాల్లో కూడా తగిన శిక్షణ, అనుభవం లేని కాంట్రాక్టు కార్మికులతో పనులు చేయిస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. సరైన భద్రతా అవగాహన, రక్షణ పరికరాల కొరత కారణంగానే ఇటీవల జరిగిన పలు ప్రమాదాల్లో కాంట్రాక్టు కార్మికులే ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారం.. నేడు కార్మికుల పాలిట ప్రమాదాల కేంద్రమై మారడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ప్లాంట్‌ భద్రత, నిర్వహణ, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కార్మిక, ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

అనిత వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం

ప్రైవేటీకరణ పేరుతో

భద్రతకు తూట్లు

ఒకప్పుడు ఉత్పత్తి లక్ష్యాల కోసం యంత్రాలపై అధిక ఒత్తిడి పెంచి ప్రమాదాలకు కారణమైన యాజమాన్యం.. ఇప్పుడు ప్రైవేటీకరణ, ఆర్థిక సంక్షోభాన్ని సాకుగా చూపుతూ భద్రతా చర్యలకే కోత పెడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఒకప్పుడు ‘ఓహెచ్‌ఎస్‌ఏఎస్‌’ సర్టిఫికెట్‌, ఇప్పుడు ‘ఐఎస్‌వో’ సర్టిఫికెట్‌ ఉందంటూ గొప్పలు చెప్పుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. భద్రతా ప్రమాణాల అమలుకు అవసరమైన నిధులను విడుదల చేయడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నీట్‌ పరీక్షార్థులకు ఉచిత బస్సు ప్రయాణం

డాబాగార్డెన్స్‌: ఈ నెల 21న జరగనున్న నీట్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు తెలిపారు. హాల్‌టికెట్‌ చూపించిన విద్యార్థులు ఆ రోజు ఎక్స్‌ప్రెస్‌, అల్ట్రా పల్లెవెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరేందుకు ముఖ్య ప్రాంతాల నుంచి అదనపు బస్సులు నడిపేందుకు డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. అలాగే ప్రతి బస్‌స్టేషన్‌లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

అంతర్జాతీయ ప్రమాణాలంటూ ప్రచారం.. క్షేత్రస్థాయిలో కనిపించని భద్రత

నిధుల కొరతతో నిలిచిపోయిన నిర్వహణ పనులు.. పెరుగుతున్న ప్రమాదాలు

శిక్షణ లేని కాంట్రాక్ట్‌ కార్మికులపై ప్రమాదకర పనుల భారం

2012 సీఎస్‌ఈ హెచ్చరికల నుంచి నేటి దుర్ఘటనల వరకు మారని యాజమాన్య వైఖరి

అంతర్గత ఆడిట్ల హెచ్చరికలూ బేఖాతరు

ప్లాంట్‌లో నిర్వహించిన అంతర్గత భద్రతా ఆడిట్లు కూడా పలు విభాగాల్లో ప్రమాదకర పరిస్థితులపై యాజమాన్యాన్ని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ లోపాల సవరణపై ఆశించిన స్థాయిలో చర్యలు చేపట్టలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాద సూచనలు ముందే ఉన్నప్పటికీ వాటిని నిర్లక్ష్యం చేయడమే వరుస దుర్ఘటనలకు కారణమవుతోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement