మహారాణిపేట: నగరంలోని డైమండ్ పార్క్ సోనోవిజన్–3 వేదికగా ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ‘2026 ప్రీమియం రిఫ్రిజిరేటర్ల’ సరికొత్త శ్రేణిని ఆదివారం ఘనంగా ఆవిష్కరించింది. ఎల్‌జీ ఇండియా హోమ్ సొల్యూషన్స్ డైరెక్టర్ యంగ్‌మిన్ హ్యాంగ్, ఏపీ రీజినల్ బిజినెస్ హెడ్ కె.వి. కృష్ణాజీ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక నీటి కనెక్షన్ అవసరం లేకుండానే మంచు ముక్కలను తయారుచేసే (ఆటో ఐస్ మేకర్) ‘భారతదేశపు తొలి 33 అంగుళాల ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్’ను ప్రదర్శించారు. ఏఐ థిన్‌క్యూ వైఫై కనెక్టివిటీ, స్మార్ట్ లెర్నర్ వంటి అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ ఫ్రెంచ్ డోర్ మోడళ్ల ధరలు రూ. 1.18 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. వీటితో పాటు ‘మేక్ ఇన్ ఇండియా’ పరిధిలో రూపొందించిన భారీ సామర్థ్యం గల సైడ్ –బై–సైడ్, డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లను కూడా విడుదల చేశారు. ఏపీ మార్కెట్లో ప్రీమియం గృహోపకరణాల విభాగంలో ఎల్‌జీ తన నంబర్ వన్ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటుందని సంస్థ ప్రతినిధి యంగ్ మిన్ హ్యాంగ్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీ రీజినల్ బిజినెస్ హెడ్ కేవీ కృష్ణాజీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో ప్రీమియం గృహోపకరణాల విభాగంలో ఎల్‌జీ తన నాయకత్వస్థానాన్ని మరింతబలోపేతం చేసుకుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిఫ్రిజిరేటర్ ప్రొడక్ట్ మేనేజర్ గియాన్ గ్యాన్, బ్రాంచ్ మేనేజర్ యుగంధర్ ఇల్లిబిల్లి, ఎల్‌జీ ఉద్యోగులు, సోనో విజన్ యాజమాన్యం, సిబ్బంది, వ్యాపార భాగస్వాములు పాల్గొన్నారు.


